27.7 C
Hyderabad
April 25, 2024 10: 33 AM
Slider కృష్ణ

రైతుల పాదయాత్ర అనుమతి రద్దుపై విచారణ వాయిదా

అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అడ్డంకులు లేకుండా చూడాలంటూ రైతులు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. పాదయాత్రలో 600 మంది రైతులు మొదటి నుంచి చివరి వరకు పాల్గొనడం కష్టమని.. రొటేట్‌ అవుతుంటారని రైతుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మహిళలు ఎక్కువ మంది ఉండటంతో వారి సమస్యలు కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. పాదయాత్రలో పాల్గొనే వారికి ముందు, వెనుక సంఘీభావం తెలిపే గ్రామస్థులు ఉంటారని చెప్పారు. సంఘీభావం తెలిపేవాళ్లు రోడ్డుకు ఇరువైపులా ఉండాలని మొదటి ఉత్తర్వుల్లో లేదని చెప్పారు. రైతులకు సంఘీభావం తెలిపేవారు భోజనాల ఏర్పాటు, వసతి కల్పించడం, విరాళాలు అందించడం చేస్తుంటారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానం మధ్యాహ్నం 12.30గంటలకు ఉత్తర్వులు జారీచేస్తే ఆ కాపీ రాకముందే పోలీసులు ఆంక్షలు విధించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఆంక్షలు విధించడంతో పాటు రైతులు భోజనం చేసే ఫంక్షన్‌ హాల్‌కు వెళ్లి ఐడీ కార్డులు చూపించమన్నారని తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి 150 మందికి మాత్రమే కార్డులు ఇచ్చారన్నారు. అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమకు సమయం కావాలని కోరారు. పోలీసు ఆంక్షల కారణంగా తాము పాదయాత్రను బలవంతంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, అందువల్ల వెంటనే విచారించాలని పిటిషనర్లు కోరారు. రేపు అన్ని పిటిషన్లను కలిపి విచారించి ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం, పిటిషనర్లు ఆచరణ యోగ్యమైన ప్రతిపాదనలతో రావాలని స్పష్టం చేసింది.

Related posts

తల్లిదండ్రుల తరువాత గురువుదే అగ్రస్థానం

Satyam NEWS

ఇక ఆత్మీయ సమ్మేళనాలు

Murali Krishna

పేరు పిచ్చితో అంబేద్కర్ ను అవమానించిన జగన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment