అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక లో ఆడాప్ట్ ఎ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆమెరికా వారి సౌజన్యంతో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో 20 మంది ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఇందులో గుండె,చర్మ ఎముకలు,నరములు,కంటి, ప్రసూతి, చిన్న పిల్లల, పంటి, జనరల్ సర్జన్, సంభందిత వ్యాధుల వారికి ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి రోగులను గుర్తించి వారికి పూర్తి స్థాయిలో పీజులు చెల్లించి సేవలు అందించ నున్నారు.ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాన్వి ఇంటర్నే షనల్ స్కూల్ అధినేత శరత్ కుమార్ రాజు సభలో మాట్లాడుతూ ఎంతోమంది శ్రీమంతులు ఉన్నా,వారిలో సేవాగుణం కలిగిన వాళ్లు అతి తక్కువ వాళ్ళు ఉంటారని అటువంటి వారిలో ఎన్నారై భూపతి రాజు ఒక్కరని అన్నారు.ఆయన ఆడాప్ట్ ఎ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాలను దత్తత తీసుకొని వైద్య శిబిరాలు నిర్వహించి వారిలో వివిధ రోగగ్రస్తులకు గుర్తించి వారికి ఉన్నతమైన హాస్పిటల్లో ఉన్నతమైన చికిత్స ఉచితంగా చేయించడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా వైద శిబిరంలో పాల్గొన్న వైద్యులకు శాలువాలతో సత్కరించారు.
previous post