32.2 C
Hyderabad
March 28, 2024 22: 45 PM
Slider జాతీయం

New Alert: కోవిడ్ వ్యాక్సిన్ తో 51 మందికి అస్వస్థత

#Covid Vaccination

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో 51 మంది కి ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు ప్రాధమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. శనివారంనాడు దేశవ్యాప్తంగా ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈ దారుణ ఫలితాలు వచ్చాయి.

ఒక పేషంట్ ను ఎయిమ్స్ లో చేర్చేంత ప్రమాదకరంగా మారింది. దక్షిణ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ లో 11 ఇలాంటి కేసులు నమోదు కాగా పశ్చిమ ఢిల్లీ, తూర్పు ఢిల్లీలో ఆరు గురు వ్యాక్సిన్ తీసుకున్న వారు అస్వస్థతకు గురయ్యారు.

దక్షిణ ఢిల్లీలో అస్వస్థతకు గురైన పేషంట్ ను ఎయిమ్స్ కు తరలించారు. ఈ మొత్తం కేసులు ఉత్తర రైల్వే కేంద్ర ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ తీసుకున్న వారి నుంచే వచ్చాయని అధికారులు వెల్లడించారు.

మరో ఇద్దరు పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయగా వారిలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అయితే వారికి చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.

ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పది నిమిషాలలోనే తన నొప్పి, దద్దుర్లు వస్తున్నాయి. తర్వాత వారికి ఊపిరి తీసుకోలేని విధంగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి.

గుండె కొట్టుకోవడం తీవ్రం కావడం మరి కొందరిలో కనిపిస్తున్నది. ఢిల్లీ లో మొత్తం ఒక్క రోజులో 4,319 మంది పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్ అందచేశారు. రాజస్థాన్ లో కూడా ప్రతికూల ఫలితాలు వస్తున్నట్లు రిపోర్టులు అందుతున్నాయి.

Related posts

10 న కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్

Satyam NEWS

ములుగును విస్మ‌రించ‌డం శోచ‌నీయం

Sub Editor

తెలంగాణ నుండి యూరప్ కు వేరుశనగ ఎగుమతులు

Satyam NEWS

Leave a Comment