36.2 C
Hyderabad
April 16, 2024 20: 37 PM
Slider జాతీయం

ఆఫ్ఘనిస్థాన్ లో మైనారిటీల హక్కులను పరిరక్షించాలి

#Jayashankar

ఆఫ్ఘనిస్థాన్ లో ప్రారంభమైన శాంతి ప్రక్రియ మైనారిటీల హక్కులను దృష్టిలో ఉంచుకుని కొనసాగాలని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సూచించారు.

సమాజంలో బలహీన వర్గాలైన మైనారిటీలు, మహిళలు, పిల్లల హక్కులకు ఎట్టి పరిస్థితుల్లో భంగం కలుగరాదని ఆయన అన్నారు.

ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారాలపై జరిగిన చర్చలో ఆయన వీడియో లింకు ద్వారా పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ప్రమాదకరమైన శత్రువులు శాంతి స్థాపనకు విఘాతం కలిగించే అవకాశం ఉందని అన్నారు.

అందువల్లే పౌరుల రక్షణకు పటిష్టమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఆఫ్ఘనిస్థాన్ లోని మొత్తం 34 ప్రావిన్సులలో మొత్తం 400 ప్రాజెక్టులను భారత్ ఇప్పటికే పూర్తి చేసిందని, ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదని జయశంకర్ తెలిపారు.

Related posts

పేద విద్యార్ధుల నుంచి ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోండి

Satyam NEWS

టీడీపీ మహిళా నేతపై వైసీపీ నేతల దురుసు ప్రవర్తన

Satyam NEWS

జర్నలిస్టు సురేశ్ ను పరామర్శించిన TWJF నేతలు

Satyam NEWS

Leave a Comment