39.2 C
Hyderabad
March 28, 2024 16: 23 PM
Slider పశ్చిమగోదావరి

దళిత భూముల స్వాహారాయుళ్లపై కొనసాగుతున్న ఉద్యమం

#dalitlands

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలో ఎసైన్డ్ భూముల వివాదాలపై భూ ఉద్యమాలకు దళిత సంఘాలు తెరలేపుతున్నారు. దాదాపు 20 ఏళ్లనాడు దళితుల భూములను, సీలింగ్ భూములను, మాజీ సైనికులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు భూస్వాముల ఆక్రమణల్లో ఉన్నాయని ఎసైన్డ్ భూముల పరిరక్షణకు ప్రవేశపెట్టిన 9/77, 1/70 యాక్ట్ లు ఏమైయ్యాయని దళిత నాయకుడు అలగా రవికుమార్ సోమవారం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  

ఈ భూముల పరిరక్షణకు అప్పటి ప్రభుత్వం కోనేరు కమిటీ వేసి కొల్లేటిలో  కలిపేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరువాత పి ఓ ట్ యాక్ట్ తెచ్చి ఐకెపి లో కొంత మంది సిబ్బందిని పారా లీగల్స్ గా ఎంపికచేసి మండలానికి ఒకరిని నియమించారు.

భూస్వాముల స్వాధీనంలో ఉన్న ఎసైన్డ్ భూములను గుర్తించి ఆ వివరాలను ప్రభుత్వానికి తెలియపరచి ఆయా మండలాలలో భూ బ్యాంక్ ను ఏర్పాటుచేసి ప్రభుత్వ అవసరాలకు, నిరుపేదల అభివృద్ధికి ఉపయోగ పడాల్సిన పేరాలీగల్స్ భూస్వాముల నుండి ముడుపులు తీసుకుని వారి స్వాధీనంలో ఉన్న ఎసైన్డ్ ఇతర ప్రభుత్వ భూముల వివరాలను ప్రభుత్వానికి తెలపకుండా కొంతమంది పారాలీగల్స్ అవినీతికి   పాల్పడ్డారని ఆరోపణలు అప్పట్లో వెలువడినట్లు సమాచారం. 

పెదవేగి మండలంలో ఎసైన్డ్ భూములు భూస్వాములకు దోచి పెట్టేందుకు రెవిన్యూ అధికారులు సుమారు 1985 నుండే రెవిన్యూ రికార్డ్ లను తారుమారు చేశారని ఆరోపించారు. పెదవేగి మండల రెవిన్యూ ప్రధాన భూరికార్డులు అధికారులు తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు మాయం చేసారని అలగా రవి ఆరోపించారు.

తాజాగా పెదవేగి మండలంలో అన్యాక్రాంతమైన కొంతమంది దళితుల ఎసైన్డ్ భూమి ఒక భూస్వామి ఆక్రమణల్లో ఉందని తమ భూమి లోకి భూస్వామి రానివ్వడం లేదని దళిత బాధితుడు మాల మహా సేన కుల సంఘాన్ని ఆశ్రయించడంతో ఆ భూమిని  అలగా రవి బాధిత దళిత రైతులతో కలిసి  భూస్వామి ఆక్రమణల్లో ఉన్న ఎసైన్డ్ భూమిలో రేకుల షెడ్ నిర్మించి బాధిత దళిత రైతుకు అండగా నిలిచినట్టు దళిత సంఘ నాయకుడు అలగా రవి తెలిపారు.

మండలంలో వేలాది ఎకరాల ఎసైన్డ్ భూములు భూ స్వాములు బడా పారిశ్రామిక వేత్తలు, డాక్టర్ లు ఇంజనీర్ లు, రాజకీయ నాయకులు, విజయవాడ హైదరాబాద్ వంటి నగరాలకు చెందిన బడా వ్యాపారుల చేతుల్లో మాజీ మంత్రులు చేతుల్లో ఉన్నట్టు రవి తెలిపారు. అటువంటి భూములన్నింటి పై పెద్ద ఎత్తున భూ  పోరాటాలు చేయ నున్నామని మాల మహా సేన రాష్ట్ర నాయకుడు అలగా రవి చెప్పారు.

ఈ విషయంపై స్థానిక తహశీల్దార్ సుందర్ సింగ్ ని వివరణ కోరగా అటువంటి సమాచారం తనకు తెలియదని చెప్పారు. ఇదిలా ఉండగా ఇదే మండలంలో ఎస్ సి కార్పొరేషన్ ద్వారా భూ కొనుగోలు పధకంద్వారా నిరుపేద దళిత మహిళలకు అమ్మరాదు, కొనరాదు అనే నిబంధనతో పంపిణీ చేసిన భూములు కూడా భూస్వాముల చేతుల్లో ఉన్నాయి.

వీటిని తిరిగి దళితులకు ఇప్పిస్తామని కొంతమంది దళిత నాయకులు భూస్వాములతో చేతులు కలిపి వారినుండి భారీగా ముడుపులు పొంది బాధిత దళితులకు వెన్నుపోటు పొడిచి మొఖాలు చాటేసుకున్న పరిస్థితి పెడవేగి మండలంలో  ఉందని బాధిత దళితులు కొంతమంది ఆరోపిస్తున్నారు. ఎసైన్డ్ భూములపై పోరాటాలు చేస్తున్న నాయకులు కూడా ఇప్పటికే భూస్వాములతో చేతులు కలిపి బాధిత దళితులకు నమ్మక ద్రోహం చేస్తూ భూస్వాములతో బేరసారాలపై చాటుమాటు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

Related posts

రోడ్లు భవనాల శాఖలో నియామకాలకు గ్రీన్ సిగ్నల్

Bhavani

గులాంనబీఆజాద్ పరువు తీసేసిన కాంగ్రెస్ పార్టీ

Satyam NEWS

మహిళలపై నేరాలను ఆపేందుకు అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

Leave a Comment