34.2 C
Hyderabad
April 19, 2024 21: 29 PM
Slider పశ్చిమగోదావరి

రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

#agriculturebill

రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణం రద్దు చేయాలని, దేశాన్ని కార్పొరేట్లకు అమ్మేస్తున్న కేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలను ప్రతిఘటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ పశ్చిమగోదావరి జిల్లా నాయకులు పిలుపునిచ్చారు.

సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈనెల 27న జరుగుతున్న భారత్ బంద్ ప్రచార పోస్టర్లను ఏలూరులోని పవర్ పేట లోని అన్నే వెంకటేశ్వరరావు భవనంలో సోమవారం ఆవిష్కరించారు. రైతాంగాన్ని రక్షించండి- దేశాన్ని కాపాడండి,ఈనెల 27న భారత్ బంద్ ను జయప్రదం చేయాలంటూ  నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, బి.కె.ఎం.యూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన రావు, ఏ ఐ కె ఎఫ్ జిల్లా కార్యదర్శి శావనంపూడి నాగరాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి.రామకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ తదితరులు మాట్లాడారు.

ఈ నెల 27న జరిగే భారత్ బంద్ కు వ్యాపార, వాణిజ్య సంఘాలు, సంస్థలు, ఉద్యోగ సంఘాలు, వివిధ సామాజిక, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రవాణా, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు బంద్ పాటించాలని కోరారు. అందరూ పాల్గొని భారత్ బంద్ ను సకల జనుల బంద్ గా నిర్వహించాలని కోరారు.

రైతు వ్యతిరేక, జాతి వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు  చేయాలని డిమాండ్ చేశారు. రైతుల వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల వ్యవసాయంగా మార్చాలనే కేంద్ర మోడీ ప్రభుత్వం తప్పుడు విధానాల వలన రైతాంగం తీవ్రంగా నష్టపోతారని, ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర వ్యవసాయ నల్ల చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లు అని అన్నారు. దేశ ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. దేశ భక్తియుత రైతాంగ ఉద్యమాన్ని అందరూ బలపరచాలని కోరారు. రైతుల పంటలకు మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం తేవాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, మోనటైజేషన్ పైపులైను ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కౌలు రైతుల రక్షణ కోసం చట్టం తేవాలన్నారు. ఉపాధి హామీ కి నిధులు పెంచాలన్నారు. పోలవరం నిర్వాసితులకు కేంద్రం పరిహారం చెల్లించాలన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు గౌడు రంగబాబు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కె రవీంద్ర, ఏ వి ఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి జి. నరసింహారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి సత్యనారాయణ, బి.కె.ఎం.యూ జిల్లా ఉపాధ్యక్షులు పొటేలు పెంటయ్య, నాయకులు బుగ్గల ప్రభాకర్, ఏ ఐ సి టి యు జిల్లా నాయకులు ఎస్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫిలిప్పైన్స్ లో కడప జిల్లా విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి

Satyam NEWS

రాష్ట్రనికి రానున్న బన్సల్

Bhavani

150 పడకల ఆసుపత్రిని 100 పడకలుగా చేస్తారా?

Satyam NEWS

Leave a Comment