39.2 C
Hyderabad
April 25, 2024 15: 43 PM
Slider ప్రత్యేకం

వ్యవసాయ శాఖ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సీఎం కేసీఆర్

#ministerniranjanreddy

ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, వ్యవసాయరంగం పట్ల ఉన్న మక్కువ, అభిలాష,  వ్యవసాయ శాఖ ఉద్యోగుల పనితీరు మూలంగా వ్యవసాయ శాఖకు ప్రజల ఆదరణ పెరిగిందని ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అత్యధిక మంది ప్రజలకు సేవలందిస్తున్నది వ్యవసాయ శాఖ అని ఆయన అన్నారు.

ప్రజలతో  ప్రత్యేక అనుబంధం పెనవేసుకున్న శాఖ గా వ్యవసాయ శాఖ పేరు పొందిందని ఆయన అన్నారు. ఏడేళ్ల క్రితం వ్యవసాయ శాఖను ఎవరూ పట్టించుకోలేదు .. తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖకు గుర్తింపు పెరిగింది అని మంత్రి అన్నారు.

అబిడ్స్ రెడ్డి హాస్టల్ ఆడిటోరియంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. అదే విధంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు వాల్ క్యాలెండర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం  చైర్మన్ బి.కృ పాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి.కృపాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ శాఖ లో అదనపు పోస్టుల మంజూరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారం  కోసం అందరం కూర్చుని చర్చిద్దాం. ఉద్యోగ సంఘాలు ఒక్క తాటి మీదకు రావాలి. నిస్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకుందాం .. అందరికీ మేలు జరిగేలా చూద్దాం అని మంత్రి తెలిపారు. కరోనా నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.

Related posts

కోనసీమ లో విధ్వంస ఘటనల వెనుక అరాచక  శక్తులు

Satyam NEWS

కక్ష సాధింపులు వద్దు… ఇప్పటికైనా మారండి

Satyam NEWS

కరోనా కోరలు పీకుతున్నదీ రక్షణ కవచం

Satyam NEWS

Leave a Comment