విజయవాడ చిట్టి నగర్ బుడమేరు ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ పరిశీలించారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ముంపు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు, మందుల కిట్లు పంపిణీ జరిగిందా లేదా అని బాధితులను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ఫైర్ ఇంజన్ల ద్వారా శుభ్రతా చర్యలు, పరిసరాల పరిశుభ్రత చర్యలు ముంపు ప్రాంతాల్లో ప్రతి చోటా జరిగే విధంగా పరిశీలన సాగుతున్నది. బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో పాటు అవసరం మేరకు ఆహార పదార్థాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
next post