40.2 C
Hyderabad
April 19, 2024 16: 03 PM
Slider ప్రపంచం

కృత్రిమ మేధస్సుతో ప్రమాదకరమే

#joebiden

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా వాడకంలో రావడం పై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు సమాజానికి ప్రమాదకరమని, అయితే సాంకేతికత సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉందని బిడెన్ అన్నారు. ఇంతకు ముందు, ఎలోన్ మస్క్, ఆపిల్ సహ వ్యవస్థాపకులు కూడా కృత్రిమ మేధస్సు గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

శక్తివంతమైన కృత్రిమ మేధస్సు వ్యవస్థల అభివృద్ధిని ఆపాలని కూడా మస్క్ హెచ్చరించాడు. సైన్స్ అండ్ టెక్నాలజీపై అధ్యక్షుడి సలహా మండలి సమావేశం ప్రారంభోత్సవంలో బిడెన్ మాట్లాడుతూ, ఇది టెక్ కంపెనీల బాధ్యత అని నేను భావిస్తున్నాను. తమ ఉత్పత్తులను ప్రజలకు విడుదల చేసే ముందు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం అవసరమని అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు ప్రమాదకరమా అని అడిగినప్పుడు, బిడెన్ అది “చూడవలసి ఉంది” కానీ ప్రస్తుతం మాత్రం “ఇది ప్రమాదకరం” అని అనిపిస్తున్నట్లు చెప్పారు. వ్యాధి నిర్ధారణ, వాతావరణ మార్పు వంటి సవాళ్లను పరిష్కరించడంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు సహాయపడుతుందని బిడెన్ చెప్పారు.

అయితే సాంకేతికత డెవలపర్లు “మన సమాజానికి, మన ఆర్థిక వ్యవస్థకు, మన జాతీయ భద్రతకు వాటిల్లే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి కృత్రిమ మేథ ను ఉపయోగించాలని ఆయన కోరారు. యువత మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావం చూపుతుందని, కొత్త టెక్నాలజీలు రక్షణ కల్పించకపోతే హాని కలిగిస్తాయని అమెరికా అధ్యక్షుడు అన్నారు.

శాన్ ఫ్రాన్సిస్కో స్టార్టప్ OpenAI ఇటీవల విడుదల చేసిన GPT-4 గురించి 1,000 కంటే ఎక్కువ మంది సాంకేతిక నిపుణులతో పాటు ఎలాన్ మస్క్, Apple సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. మస్క్ మరియు అనేక ఇతర సాంకేతిక నిపుణులు AI అభివృద్ధిని ఆపాలనుకుంటున్నారు.

మనిషిని పోలిన మేధస్సుతో కూడిన నమూనాల అభివృద్ధిని నిలిపివేయాలని నిపుణులు భావిస్తున్నారు. GPT-4 కంటే శక్తివంతమైన AI సిస్టమ్‌లకు కనీసం 6 నెలల పాటు శిక్షణ ఇవ్వడం AI ల్యాబ్‌లు వెంటనే నిలిపివేయాలని వారు అంటున్నారు.

Related posts

HYDERABAD ORR హెల్ప్ లైన్ కొత్త నెంబర్ ఇదే

Bhavani

ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయలు

Sub Editor

Analysis :మాయదారి చైనా మన దారికి వచ్చేనా?

Satyam NEWS

Leave a Comment