కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు.. కొత్త భవనానికి ‘ఇందిరా గాంధీ భవన్’ అని పేరు పెట్టారు. దీన్ని పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్, తెలంగాణ సీఎం ఏ. రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల పాల్గొన్నారు..