29.2 C
Hyderabad
October 13, 2024 15: 27 PM
Slider ప్రపంచం

నేపాల్ లో విమానం క్రాష్: 18 మంది మృతి

#nepalairlines

నేపాల్ రాజధాని ఖాట్మాండు‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోప్పోయారు. త్రిభువన్ విమానాశ్రయంలో ఓ విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో సిబ్బంది సహా 19 మంది ఉన్నారు. ఈ విమానం పోఖరాకు వెళ్తోంది. ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలియగానే ప్రమాదస్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. మంటలు చెలరేగడంతో ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.విమానంలో 19 మంది సాంకేతిక సిబ్బంది ఉన్నట్లు నేషనల్‌ మీడియా తెలిపింది.

అందులో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. పైలట్‌ 37 ఏళ్ల మనీశ్‌ షక్య ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పైలట్‌ను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఇప్పటి వరకూ 13 మంది మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదం అనంతరం విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Related posts

సమాజానికి హక్కులతో బాటు బాధ్యతలు ఉండాలి

Satyam NEWS

మాదక ద్రవ్యాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం: అమిత్ షా

Satyam NEWS

466 అంబులెన్సులు ప్రారంభం

Bhavani

Leave a Comment