30.2 C
Hyderabad
October 13, 2024 17: 09 PM
Slider ప్రపంచం

దక్షిణ గాజా పై వైమానిక దాడి: 40 మంది మృతి

#palistine

హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతున్నది. దక్షిణ గాజా స్ట్రిప్పై జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మృతి చెందగా, మరో 60 మందికి పైగా పాలస్తీనీయులు గాయపడ్డారు. గాజా పట్టీలోని ఖాన్ యునిస్, అల్-మవాసిలో ఏర్పాటు చేసిన నిరాశ్రయ జోన్పై ఇజ్రాయెల్ సైన్యం దాడికి పాల్పిడింది. ఈ ఘటనలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. గతంలో దీనిని సురక్షితమైన జోన్ అని, ఎలాంటి దాడులు జరగబోవని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయినప్పటికీ దాడికి పాల్పడడం గమనార్హం.

అయితే, హమాస్ కమాండ్ సెంటర్ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే ఈ దాడులు చేశామంటూ సైన్యం పేర్కొంది. గ్రాజా స్ట్రిప్లోని ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ ప్రాంతాలు, సైన్యానికి వ్యతిరేంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, అందుకే దాడి చేస్తున్నట్లు పేర్కొంది. దాడి రాత్రిపూట దాడి జరిగిందని, 40 మంది చనిపోగా 60 మంది గాయపడ్డారని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మహమూద్‌ బసల్‌ తెలిపారు. స్థానిక శిభిరాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు దాడులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, దీంతో చాలా మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 15 మంది ఆచూకీలేకుండా పోయారని తెలిపారు. వారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

Related posts

2500 కిలోల గంజాయి దహనం

Murali Krishna

పరామర్శించడం కాదు…కూలిన ఇళ్లకు పరిహారం ఇవ్వండి

Satyam NEWS

ఏపిలో రాజకీయ పునరేకీకరణకు ఇది లాంగ్ మార్చ్

Satyam NEWS

Leave a Comment