37.2 C
Hyderabad
March 29, 2024 17: 39 PM
Slider హైదరాబాద్

పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్న AISF రాష్ట్ర నాయకులు

నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు AISF అధ్వర్యంలో ఢిల్లీ లో పార్లమెంట్ మార్చ్ నిర్వహించడం జరిగింది జన్ పత్ నుండి పార్లమెంట్ మార్గం రోడ్డు వరకు ర్యాలీ సాగగా అక్కడ పోలీసులు అడ్డుకోవడం జరిగిందని ఈ మార్చ్ లో తెలంగాణ నుండి 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాదని నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్య ప్రైవేటీకరణ, కాషాయికరణ చేయడానికి కుట్ర చేస్తుందని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని మోడీ ప్రభుత్వం విస్మరించిందని విద్యార్థుల చదువులకు ఉపయోగించే స్టేషనరి వస్తువులపై జీఎస్టీ విధించడం సిగ్గు చేటని కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి కనీసం 10%నిధులు కూడా కేటాయించడం లేదని మోడీ ప్రభుత్వం తెలంగాణ విభజన హామీ చట్టాలను అమలు చేయకుండా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నరాని గిరిజన యూనవర్సిటీ ఏర్పాటు లేదని, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు లో కూడా తెలంగాణ పట్ల కక్ష్య చూపిస్తున్నారని గుజరాత్ రాష్ట్రంలో ఐఐఐటీ, ఐఐఎం లాంటి విద్యాసంస్థలను అనేక నెలకొల్పుతూన్న తెలంగాణ కి ఎనిమిది సంవత్సరాల్లో ఒక్క విద్యాసంస్థ కేటాయింపు లేదని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు లేదని, కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ను విస్మరిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నదని విద్యార్థులు మోడీ ప్రభుత్వం పై ఉద్యమాలకు సిద్దం కావాలని వారు పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అశోక్ స్టాలిన్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బెరర్స్ రెహమాన్, కసోజు నాగ జ్యోతి, రఘురాం, బాలసాని లెనిన్ సోతుకు ప్రవీణ్ ,రాజు తదితరులు పాల్గొన్నారు

Related posts

రఘురాముడిపై పాల్ ను ప్రయోగించింది ఎవరు?

Satyam NEWS

నిరుపేద ఆడబిడ్డలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS

అక్రమ వ్యాపారాలు చేసే వారు పవన్ నువిమర్శస్తారా

Satyam NEWS

Leave a Comment