36.2 C
Hyderabad
April 25, 2024 22: 32 PM
Slider మహబూబ్ నగర్

కూలీలకు అడ్డా సౌకర్యం కల్పించాలి: ఏఐటీయూసీ

#aituc

కూలీలకు అడ్డా సౌకర్యం కల్పించాలని ఏఐటీయూసీ నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అడ్డ సౌకర్యం లేక సంత బజార్ ఏరియా లో అరకిలో మీటర్ మేర నాగర్ కర్నూల్ పట్టణం, ఎండ బెట్ల, ఉయ్యాలవాడ, వనపట్ల, కోటల్ గడ్డ, తిరుమలాపూర్, దేశిటికాల, చెర్ల ఇటికాల పలు గ్రామాల నుండి పొట్ట చేత పట్టుకొని బ్రతుకు దెరువు కోసం ఉదయాన్నే ఏడున్నర గంటలకు సంతబజారు కు చేరుకొని పని కోసం వెతకడం ఆరంభిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.ఏ ద్విచక్ర వాహనం వచ్చి వారి దగ్గర ఆగిన ఏం పని ఉంది సార్ మేమువస్తా మంటూ పోటాపోటీ నా చుట్టూ గూమి కూడతారని ఆ రోజు పని దొరికితేనే వారి కుటుంబం పిల్లలకు ఆహారం దొరుకుతుందని  లేదంటే పస్తులు ఉండాల్సిందేనన్నారు.

చాలా గణనీయమైన స్థితిలో వారి పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి వీరికి ఏ నాడు ఎలాంటి నయాపైసా సాయం అందలేదన్నారు. అడ్డా సౌకర్యం లేక పలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వారికి వీలైనంత త్వరగా అడ్డ సౌకర్యం కల్పించాలని గతంలో పలుమార్లు కలెక్టరేట్ ముందు ఆందోళన చేసిన, మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. దక్షిణ వారి గడ్డ సౌకర్యం కల్పించాలని, షెడ్డు నిర్మించి ఇవ్వాలని, కనీస అవసరాలు కల్పించాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని, అందరికీ డబల్ బెడ్ రూమ్స్  , అర్హులందరికీ పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు, 55 ఏండ్లునిండిన ప్రతి కార్మికుడికి నెలకు మూడు వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉన్నతాధికారులు, లేబర్ అధికారి అడ్డా ను సందర్శించి వారి సమస్యలను గోడును వినాలని సత్వరమే వారి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  ఏ ఐ టి యు సి అధ్యక్షులు టీ కిరణ్ కుమార్, జిల్లా నాయకులు పరమేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కే ఎసయ్య, ఏ ఐ టి యూసి నాయకులు శివ కృష్ణ, రాజు అడ్డా కూలీల నాయకులు శేఖర్, బంగారయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెండింగ్ పనులను పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

Satyam NEWS

మళ్లీ కరోనా

Murali Krishna

సూర్య భగవాన్ కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఉత్తర భారతీయులు

Satyam NEWS

Leave a Comment