28.2 C
Hyderabad
April 20, 2024 13: 52 PM
Slider విజయనగరం

వి.ఆర్.ఎ ల న్యాయమైన పోరాటానికి ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు

#aituc

రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో వి.ఆర్.ఎ లకు నెలకి 15 వేలు జీతం ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కారంటూ ఏఐటీయూసీ ఆరోపించింది. 3 ఏళ్ళల్లో చెల్లించిన 300 రూపాయిల డి.ఏ లను తిరిగి చెల్లిస్తేనే ప్రస్తుతం ఇస్తున్న 10,500 జీతం ఇస్తామని ప్రకటించడం చాలా దుర్మార్గమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు  విజయనగరం తహశీల్దార్ కార్యాలయం ముందు గ్రామ రెవిన్యూ సహాయకులు ( వి.ఆర్.ఎ ) లు చేస్తున్న రిలేనిరాహార దీక్షా శిభిరం వద్దకు వెళ్ళి ఏఐటీయూసీ జిల్లా సమితి తరపున సంపూర్ణ మద్దతు తెలియచేశారు. దీక్షల్లో ఉన్న వి.ఆర్.ఎ లతో బుగత అశోక్ మాట్లాడుతూ 11 వ పిఆర్సి నివేదికలో విఆర్ఎల వేతనాల పెంపుదల ప్రస్తావనే లేకపోవడం బాధాకరమన్నారు. రెవిన్యూ వ్యవస్థలో రాష్ట్ర వ్యాప్తంగా 20 వేలకు పైగా విఆర్ఎలు పనిచేస్తున్నా వారి వేతనాల పెంపుదల ఊసేలేకపోవటం అన్యాయని ఆవేదన వ్యక్తంచేశారు.

విఆర్ఎలకు న్యాయం చేస్తామని జగనన్న ఇచ్చిన హామీ నేటికి అమలు చేయడంలో మాట తప్పారన్నారు. ప్రస్తుత తీవ్రమైన ఆర్ధిక భారాలతో ప్రభుత్వం నెలకి ఇస్తున్న కేవలం 10వేలు 500 లతో వి.ఆర్.ఎ కుటుంబాలు బ్రతుకు ఎంత కష్టమో గ్రహించాలన్నారు. రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురించి చర్చిస్తున్న ప్రభుత్వం విఆర్ఎల వేతనాల పెంపుపై కూడా నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పిఆర్సి సందర్భంగానే ఆ రాష్ట్రంలోని విఆర్ఎలకు 30 శాతం వేతనాలు పెంచింది కాని మన రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఎల సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడం సరైంది కాదన్నారు. వేతనాలు పెంచాలని అనేకసార్లు పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోగా పుండు మీద కారం చల్లినట్టు వైసిపి అదుకారంలోకి వచ్చిన 3 ఏళ్ళ నుంచి చెల్లిస్తున్న 300 రూపాయలు డిఎ ను వేతనం నుండి తిరిగి వెనక్కి చెల్లిస్తేనే రికవరీ ప్రకటన చేయడం దుర్మార్గమన్నారు.

ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతరభృతి తిరిగి రికవరీ చేయరాదని స్పష్టంగా చెప్పింది. ఇదే న్యాయం విఆర్ఎల డిఎ రికవరీ విషయంలో కూడా వర్తిస్తుందన్నారు. కావున ప్రభుత్వం తక్షణం డిఎ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించుకొని డిఎతో కూడిన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కనీస వేతనం 21000 వేలు ఇవ్వాలని , డిఎ తో కలిపి వేతనం చెల్లించాలని నామీనీలను విఆర్ఎలుగా నియమించాలని , అర్హులకు ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేసారు.

65 సంవత్సరాలు దాటి చనిపోయిన విఆర్ఎ కుటుంబంలో కంపాన్ సేట్  గ్రౌండ్ క్రింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనే న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం వి.ఆర్.ఎ లు చేస్తున్న దశల వారి పోరాటంలో ఏఐటీయూసీ భాగస్వామ్యం అవుతుందని బుగత అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్.రంగరాజు, జిల్లా కార్యదర్శి టి.జీవన్, ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ర్ర అధ్యక్షురాలు కె.శ్రవంతి, ఏ.పి. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎ. మారయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

Sub Editor

గడప గడపకు నిరసన సెగలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఆళ్ల నాని

Bhavani

జాతీయ నాయకులకు అందరూ కనీస గౌరవం ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment