సామాన్య ప్రజలకు విద్యను దూరం చేసేందుకే నూతన జాతీయ విద్యా విధానం పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివ శంకర్ పేర్కొన్నారు. మంగళవారం నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలోని రహదారుల భవనాల అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏ ఐ వై ఎఫ్ కల్వకుర్తి మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివ శంకర్ మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారంలో రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రచారం చేసిన బిజెపి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు ధనార్జనే ధ్యేయంగాకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రయ్య కార్యదర్శి శ్రీనివాసులు ఉపాధ్యక్షులు లింగం నాగరాజు సహాయ కార్యదర్శి వెంకటేశు శ్రీనివాసులు ప్రకాష్ కమిటీ సభ్యులు కృష్ణయ్య శంకర్ పరశురాముడు శివ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు