33.2 C
Hyderabad
April 26, 2024 01: 23 AM
Slider ఆధ్యాత్మికం

హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే.. బలమైన ఆధారాలు

#Anjanadrihills

హనుమంతుడి జన్మస్థలం విష‌యంపై ఉగాది సంద‌ర్భంగా తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీవారు కొలువై ఉన్న‌ తిరుమలే ఆంజ‌నేయుడి జన్మస్థలమని ఆధారాల‌తో పాటు టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి ప్ర‌క‌ట‌న చేశారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. హ‌నుమ‌ జన్మస్థలంపై పండితులు ఆధారాలు సేకరించారని, త‌మ‌ వద్ద ఉన్న‌ ఆ బలమైన ఆధారాలను బయటపెడతామ‌ని చెప్పారు.

ఆధారాలతో నివేదిక తయారు చేశామ‌ని, దాన్ని త్వ‌ర‌లోనే ప్రజల ముందుంచి అభిప్రాయాలు సేకరిస్తామ‌ని తెలిపారు. ఆంజ‌నేయుడి జన్మస్థలం తమ రాష్ట్రంలోనే ఉంద‌ని ఇప్ప‌టివ‌ర‌కు ఏ రాష్ట్రమూ ప్రకటించలేదని ఆయ‌న చెప్పారు. ఒక‌వేళ ఇతర రాష్ట్రాల వ‌ద్ద అటువంటి ఆధారాలు ఉంటే బయటపెట్టవచ్చ‌ని చెప్పారు.

ఈ విష‌యంపై  క్షేత్రస్థాయిలో చర్చ జరగాలని వ్యాఖ్యానించారు. తిరుమల సప్తగిరుల్లో ఒకటైన అంజనాద్రిలోనే ఆంజనేయుడు జన్మించాడన్న విషయంపై గ‌త ఏడాది డిసెంబరులో పండితులు, నిపుణులతో టీటీడీ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై పరిశోధన సాగించిన క‌మిటీ నివేదిక‌ను స‌మ‌ర్పించింది.

మెట్రో టివి సురేష్

Related posts

రాబోయే సమ్మెను దృష్టిలో ఉంచుకుని HRA లో మార్పులు

Satyam NEWS

కొల్లాపూర్ లో యాదవులపై నయీమ్ గ్యాంగ్ వరుస దాడులు

Satyam NEWS

సరిగ్గా చూడండి ఈ ఎద్దుల బండిపై ఏమి ఉన్నాయి?

Satyam NEWS

Leave a Comment