33.7 C
Hyderabad
February 13, 2025 21: 31 PM
Slider ఆధ్యాత్మికం

మహా కుంభమేళాకు వచ్చిన అఖారా సాదువులు

#kumbhamela

మహా కుంభమేళాకి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేస్తోంది. మహాకుంభ మేళాకి అఖారాలు ప్రయాగ్ రాజ్ కు వస్తున్నారు. మహా కుంభమేళాను పురస్కరించుకొని విచ్చేసిన అఖారాలోని సాధువులందరికీ వివిధ ప్రదేశాలలో పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. వీరికి త్రివేణీ ఒడ్డున సన్నాహాలు కూడా చేశారు. ఆచార్య మహా మండలేశ్వర స్వామి అరుణ్ గిరి నేతృత్వంలో అఖారా మడౌకాలోని ఆశ్రమం నుంచి బయల్దేరి, మహాకుంభమేళా ప్రదేశానికి చేరుకున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ఇప్పటివరకు 122 మహాకుంభాలు,123 కుంభాలను నిర్వహించిన శ్రీ పంచ దశనం ఆవాహన్ అఖారా పురాతన అఖారా అని స్వామి అరుణ్ గిరి తెలిపారు. అఖారా కంటోన్మెంట్ ప్రవేశ యాత్రలో డజనుకు పైగా మహా మండలేశ్వరులు,51 మంది శ్రీ మహంతులు, పెద్ద సంఖ్యలో నాగ సన్యాసిలు వచ్చారని మహంత్ గోపాల్ గిరి తెలిపారు. ఈ అఖారా సాధువులు గుర్రాలపై, ఒంటెలపై స్వారీ చేస్తూ కుంభమేళా ప్రదేశంలోకి వచ్చారు.అఖారా దేవత భగవాన్ గజాననుడి రథం, ఆ తర్వాత పంచ పరమేశ్వర్ రామతా పంచ్,అఖారా ఆచార్య మహామండలేశ్వరుడి రథం ఈ యాత్రకు నాయకత్వం వహించాయి.

Related posts

టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ సస్పెన్షన్?

Satyam NEWS

కొల్లాపూర్ పాలిటిక్స్: టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన జగదీశ్వర్ రావు

Satyam NEWS

ట్రయల్ కోర్టు తర్వాత సుప్రీందే తుది నిర్ణయం కావాలి

Satyam NEWS

Leave a Comment