27.7 C
Hyderabad
March 29, 2024 01: 43 AM
Slider జాతీయం

భార్య కోసం చెమటోడుస్తున్న అఖిలేష్ యాదవ్

#dimpleyadav

తండ్రి ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి పార్లమెంటు స్థానాన్ని నిలబెట్టుకోవడానికి సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విపరీతంగా శ్రమపడుతున్నారు. గతంలో రాంపూర్, అజంగఢ్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కనీసం అక్కడికి వెళ్లడం కూడా చేయని అఖిలేష్ యాదవ్ మెయిన్‌పురిలో ప్రాణాలకు తెగించి పోరాడుడున్నారు. రాంపూర్, అజంగఢ్ ఉపఎన్నికలకు ఆయన హాజరు కాకపోవడం పై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద సంచలనం అయింది. విపక్షాలు పదే పదే హేళనలు చేసినా, మీడియా ప్రశ్నించినా అఖిలేష్ యాదవ్ ఒక్కసారి కూడా ఈ రెండు సీట్ల వైపు తిరగలేదు. కానీ ఇప్పుడు మెయిన్‌పురిలో చెమటోడుస్తున్నారు. మెయిన్‌పురిలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అయితే ఈ సీటు కోసం ఇంత శ్రమ ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతోంది. మెయిన్‌పురి సీటు ఎస్పీకి అత్యంత సురక్షితమైనదని ఆయనకు నమ్మకం లేదా? అనే ప్రశ్న ఉదయిస్తున్నది.

మెయిన్‌పురి చాలా కాలంగా అంటే దాదాపు 3 దశాబ్దాల పాటు ములాయం సింగ్‌కు సుస్థిర స్థానం. ఇప్పుడు ఆయన మరణానంతరం ఆ వారసత్వాన్ని తిరిగి పొందేందుకు అఖిలేష్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇతర అభ్యర్థులను కాదని తన భార్య డింపుల్ యాదవ్‌కు ఈ సీటు కేటాయించారు. ఇప్పటికే అజంగఢ్ మరియు రాంపూర్ కోల్పోయిన సమాజ్ వాది పార్టీ ఇప్పుడు మెయిన్ పురిని కోల్పోవడానికి సిద్ధంగా లేదు.

రాంపూర్ మరియు అజంగఢ్ లలో గెలుపుపై అఖిలేష్ యాదవ్ ధీమాతో ఉన్నారు. అందుకే రెండు స్థానాల్లోనూ ఒక్కరోజు కూడా ప్రచారానికి వెళ్లలేదు. అజంగఢ్ ఉప ఎన్నికలో అఖిలేష్ యాదవ్ పాల్గొనకపోవడమే అతిపెద్ద ఆశ్చర్యం, ఎందుకంటే ఈ స్థానం ఆయనదే. మైన్‌పురిలోని కర్హాల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత అఖిలేష్ అజంగఢ్ పార్లమెంటరీ స్థానాన్ని వదిలిపెట్టారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ లో అఖిలేష్ యాదవ్ రెండు స్థానాల్లో ఓడిపోయారు. ఇప్పుడు అతను మెయిన్‌పురిలో చరిత్ర పునరావృతం కావడానికి ఇష్టపడడంలేదు.

గత కొద్ది కాలంగా బాబాయి శివపాల్ యాదవ్ తో అఖిలేష్ సఖ్యతగా లేరు. ఈ సారి బాబాయితో అఖిలేష్ ఎంతో సఖ్యతతో ఉన్నారు. మెయిన్‌పురి లోక్‌సభ స్థానంలో యాదవుల తర్వాత శాక్యలు రెండవ అతిపెద్ద కులం. వారు యాదవుల కంటే కొంచెం తక్కువ. ములాయం సింగ్ హయాంలో ఆయనకు శాక్య ఓటర్ల మద్దతు కూడా లభించింది. కానీ ఇప్పుడు ఆయన తర్వాత అదే విధంగా కొనసాగుతుందా లేదా అనేది అనుమానంగా ఉంది. శాక్య ఓటర్లను చైతన్యం చేయడం కోసమే బీజేపీ పాత ఎస్పీ రఘురాజ్ శాక్యాను ఎన్నికల్లో పోటీకి దింపింది. అఖిలేష్ యాదవ్ కూడా మెయిన్‌పురి జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే అలోక్‌షాక్యా ను నియమించారు. పోలింగ్ నాటికి ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

నేను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు కరెక్టు కాదు

Satyam NEWS

ఉత్తమ టీచర్లకు నిర్మల్ లయన్స్ క్లబ్ సన్మానం

Satyam NEWS

ఆగస్టు 5 నుంచి సినిమా హాళ్లను తెరుస్తున్నారు

Satyam NEWS

Leave a Comment