29.2 C
Hyderabad
September 10, 2024 17: 34 PM
Slider సినిమా

ఒక ఇంటివారు కాబోతున్న అక్కినేని నాగ్ శోభిత

#akkineni

అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి చేసుకోబోతున్నారు. గురువారం ఉదయం 9.42 గంటలకు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా నాగార్జున తెలిపారు. “శోభితను మా కుటుంబంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంట జీవితం, ఆనందం, ప్రేమతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది’’ అని నాగార్జున ట్వీట్‌లో పేర్కొన్నారు.

దీనితో నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. గత కొద్ది కాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం నాగచైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో నిర్మితమౌతున్న  ‘తండేల్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. శోభితా 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచారు. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. 2013 మిస్‌ ఎర్త్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.  ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టారు. 2016లో తొలిసారి నటించారు. అనురాగ్‌ కశ్యప్‌ డైరెక్షన్‌లో ‘రామన్‌ రాఘవ్‌’ చిత్రం చేశారు.

‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. 2018లో తెలుగులో వచ్చిన గూఢాచారి, 2022లో వచ్చిన మేజర్‌ సినిమాలతో హిట్‌ అందుకున్నారు. శోభితా  ధూళిపాళ్ల 1993, మే 31న వేణుగోపాల్‌ రావు, శాంత దంపతులకు జన్మించారు. తెనాలి స్వస్థలం. విశాఖపట్నంలో లిటిల్‌ ఏంజెల్స్‌ స్కూల్‌, విశాఖ వ్యాలీ స్కూల్‌లో చదివింది. ముంబై యూనివర్సిటీ, హెచ్‌.ఆర్‌ కాలేజ్‌లో కామర్స్‌, ఎకనామిక్స్‌ పూర్తి చేసింది. సంప్రదాయ నృత్యాలైన  భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటున్నారు.

Related posts

చిత్ర పరిశ్రమకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న మహత్తర అవకాశం

Satyam NEWS

విజయనగరం కలకలం.. చిన్నారులను బస్టాండ్ లో వదిలేసిన బాబాయ్…!

Satyam NEWS

హిట్లర్ లాంటి నియంతలే పోయారు… నెవ్వెంత?

Bhavani

Leave a Comment