25.2 C
Hyderabad
March 22, 2023 21: 49 PM
Slider సినిమా

నీ వయసేంటి? నువ్వేసిన వేషమేంటి?

7-jpg_710x400xt

వయసుకు మించిన పాత్రలు చేస్తే ఆహా అంటారు. వయసు మరచి పాత్రలు చేస్తే ఆహా ఇక ఆపు అంటారు. మహానటి సినిమాలో సావిత్రి పాత్రను పండించి అందరితో ఆహా అనిపించుకున్న నటి కీర్తీ సురేష్. జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డు గెలుచుకుంది. అదే 40 ఇయర్స్ ఇండస్ట్రీ నాగార్జున ఏం చేశాడు? తన వయసులో చేయాల్సిన పాత్ర కాకుండా కుర్రవేషం వేసి దారుణంగా దెబ్బతిన్నాడు. మన్మధుడు 2 లో నాగార్జున వేసిన ప్లేబాయ్ క్యారక్టర్ ఆయనకు ఎలా అనిపించిందో కానీ చూసే వారికి మాత్రం ఎంతో ఎబ్బెట్టుగా కనిపించింది. ఏ వయసులో వారు ఆ రకం పాత్రలు చేస్తే పండుతాయి అయితే నాగార్జునలాగా చేస్తే వికటిస్తాయి. నాగార్జున నటించిన మన్మధుడు 2 చిత్రం విడుదలైన తర్వాత ఆక్యుపెన్సీ రేటు బాగా తగ్గిపోతున్నది. ఆయనకు చెందిన మీడియా ఈ చిత్రాన్ని ఎంత హైప్ చేసి చూపిస్తున్నా కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగా లేకపోవడం ఇక్కడ గమనార్హం. ఈ శని, ఆది వారాలు దాటి బక్రీద్ సెలవు కూడా అయిపోయి తర్వాత మన్మధుడు 2 చాలా చోట్ల ఎత్తేసే పరిస్థితే కనిపిస్తున్నది. మంగళవారానికి మన్మధుడు చిత్రం ఆక్యుపెన్సీ రేటు 15 – 20 మధ్యకు రావచ్చని అంచనా వేసుకుటున్నారు. మన్మధుడు చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 5 కోట్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 3.86 కోట్ల రూపాయలు వసూలు చేయగా నైజాం ఏరియాలో రూ. 1.3 కోట్లను రాబట్టింది. అంతే ఆ తర్వాత నుంచి అంటే రెండో రోజు నుంచి తగ్గడం ప్రారంభించింది. చిన్న సినిమా అయిన సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’ చిత్రానికి పాజిటవ్ టాక్ ఉండటం కూడా మన్మధుడు కలెక్షన్లకు బ్రేక్ వేసింది. అర్బన్ సెంటర్లలో కొంచెం కలెక్షన్లు వస్తున్నా బి సి సెంటర్లలో మాత్రం మన్మధుడు 2 ఈగలు తోలుకుంటున్నదని ట్రేడ్ వర్గాల రిపోర్టు. అందుకే నాగార్జున ఇక నైనా కక్కుర్తి పడకుండా తన వయసుకు తగిన పాత్రలు వేస్తే కలెక్షన్ల సంగతి ఎలా ఉన్నా ఉన్న మంచి పేరు మాత్రం చెడగొట్టుకోకుండా ఉంటాడు.

Related posts

కరోనాతో సతమతమౌతున్న రజకులను ఆదుకోవాలి

Satyam NEWS

జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా పసుపుల

Satyam NEWS

త్రిబుల్ ఆర్ వైద్య పరీక్షల నివేదిక సీల్డ్‌కవర్‌లో సుప్రీంకోర్టు కు…

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!