అక్కినేని జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. 2018, 2019 సంవత్సరాలకు గాను ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో 2018కి గాను దివంగత నటి శ్రీదేవికి పురస్కారం ప్రకటించగా, శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీకపూర్ ఈ అవార్డును మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా అందుకున్నారు. అలాగే 2019కి గానూ బాలీవుడ్ సీనియర్ నటి రేఖకు అక్కినేని అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ తెలుగు సినిమా ఉన్నంతవరకూ అక్కినేని నాగేశ్వరరావు అందరి మనస్సులో ఉంటారని అన్నారు. నాన్నగారు భౌతికంగా మనమధ్య లేకున్నా ఆయన ఆత్మ మన మధ్య, మనతో ఇక్కడే ఉంది. జాతీయ అవార్డుతో పాటు నాన్నగారు కూడా ఈ వేదికపైనే ఉన్నారు. ఆయన సంకల్పం నెరువుతుందని సంతోషంగా ఉన్నారు.’ అని పేర్కొన్నారు. గతంలో దేవానంద్ , షాబానా ఆజ్మీ , లతా మంగేష్కర్ , కే బాల చందర్ ,హేమమాలిని, అమితాబచ్చన్ , రాజమౌళి లాంటి ప్రముఖులకు అక్కినేని జాతీయ పురస్కారాలు అందజేశారు. ఎప్పటికైనా ‘అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం’ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం స్థాయికి చేరుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘ఏఎన్నార్ ఎప్పుడూ మన మనస్సులో ఉంటారు. చనిపోయే ముందు వరకూ ఆయన ఎంతో ధైర్యంగా ఉండేవారు. ఏఎన్నార్ జీవితం నాలో స్ఫూర్తి నింపింది అన్నారు.
previous post