పేద పిల్లల ఆకలి తీర్చే అక్షయపాత్ర ఫౌండేషన్ కు సాయం చేసేందుకు ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్ మెంట్, టెక్నాలజీ డెవలప్ మెంట్ సంస్థ అయిన డి షౌ ఇండియా కంపెనీ ముందుకు వచ్చింది. అక్షయ పాత్ర ఫౌండేషన్ కు నార్సింగ్ లో ఉన్న వంటశాలకు సోలార్ ప్యానెల్స్ ను డీ షౌ ఇండియా కంపెనీ స్పాన్సర్ చేస్తున్నది. నేడు ఈ సోలార్ ప్యానెల్స్ ను కంపెనీ ప్రతినిధులు ప్రారంభించి అక్షయ పాత్ర ఫౌండేషన్ కు అందచేస్తారు. నార్సింగ్ లో అక్షయ పాత్ర ఫౌండేషన్ కు సెంట్రలైజ్ డు కిచన్ ఉంది. ఈ కార్యక్రమంలో డీ షౌ కంపెనీ ప్రతినిధులతో బాటు అక్షయపాత్ర ఫౌండేషన్ తెలంగాణ, ఏపి ప్రాంతీయ అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస ప్రభూజీ కూడా పాల్గొంటారు.