స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో. ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. రాములో రాములా అంటూ సాగే ఈ సాంగ్ స్టైలిష్ స్టార్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. 26 సెకండ్స్ డ్యూరేషన్ తో వచ్చిన ఈ సాంగ్ అల్లు అర్జున్ చాలా కొత్తగా కనిపించాడు. బన్నీ, పూజ హెగ్డేలు పర్ఫెక్ట్ పెయిర్ లాగా కనిపిస్తున్నారు. సాంగ్ టీజర్ అంటూ బయటకి వచ్చిన ఈ రాములో రాములా ఫుల్ సాంగ్ ని 26వ తేదీన విడుదల చేయనున్నారు. మాస్ బీట్ సాంగ్ కి కాస్త క్లాసీ టచ్ ఇచ్చిన థమన్, మరో చార్ట్ బస్టర్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. మరి సామజవరగమనా మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేస్తారేమో చూడాలి.
previous post