21.7 C
Hyderabad
November 9, 2024 06: 56 AM
Slider సినిమా

అల వైకుంఠపురములో అల్లూ అర్జున్

alavaikunthapuramuloo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పేరును అల వైకుంఠపురములో అని నిర్ణయించారు. దీనికి  సంబంధించిన వీడియోను ఈరోజు ఉదయం విడుదల చేశారు.  హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19 వ చిత్రం కాగా, అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల  కాంబినేషన్ లో మూడో చిత్రం. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాల్లో, అటు ప్రేక్షక వర్గాల్లోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వీటిని నిజం చేసే దిశగా సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ‘గీతాఆర్ట్స్’ అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. రెండు పెద్ద నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తుండడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. 

Related posts

కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ నేతలు

Satyam NEWS

హత్యను జగన్ దృష్టి తీసుకెళ్తాం

Sub Editor

కష్టపడి పని చేస్తున్నాం మా మనోభావాలు దెబ్బతీయవద్దు

Satyam NEWS

Leave a Comment