22.7 C
Hyderabad
February 14, 2025 01: 39 AM
Slider కడప

యుద్ధ ప్రాతిపదికన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల పనులు

#ontimitta

2025 ఏప్రిల్ మాసంలో టీటీడీ ఆధ్వర్యంలో కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆలయంలో, శ్రీరాముని కళ్యాణ వేదిక వద్ద గుత్తేదారులు నిర్వహిస్తున్న పనుల పరిశీలన నిమిత్తం సోమవారం టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఒంటిమిట్టకు జరిగింది. ముందుగా ఆయన ఆలయంలోని గుత్తేదారులు నిర్వహిస్తున్న పనులను పరిశీలించి బ్రహ్మోత్సవాల సమయానికల్లా పూర్తి పనులు నిర్వహించాలని తెలియజేశారు.

టీటీడీ పరిపాలన భవనంలో ఆలయ టిటిడి అధికారులకు సమావేశం నిర్వహించి 2025 ఏప్రిల్ మాసంలో టిటిడి ఆధ్వర్యంలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయించాలని తెలియజేశారు.సమావేశంలో కొన్ని కీలక విషయాలు అధికారులతో ప్రస్తావనకు తేవడం జరిగింది. అనంతరం ఆయన కోదండ రామస్వామి కళ్యాణ వేదిక వద్ద చేపడుతున్న పనులను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు.

ఒంటిమిట్ట సమస్యలపై ఒంటిమిట్ట చెరువు చైర్మన్ పాటూరు. గంగిరెడ్డి ,కొత్తపల్లె. బొబ్బిలి రాయుడు ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా వారు జేఈఓ తో మాట్లాడుతూ టీటీడీకి అనుసంధానంగా ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలో చికెన్ దుకాణాలు 400 మీటర్లు దూరంలో ఏర్పాటు చేయాలని ఆలయ సరిహద్దుల్లోని 100 మీటర్ల లోపల చికెన్ దుకాణాలు నెలకొని ఉండటం చేత వాటిని అపవిత్రంగా భావించి తొలగించాల్సిందిగా పలుమార్లు ఆలయ అధికారులకు తెలియజేయడం జరిగిందని కానీ వారు ఆ దుకాణాలను తొలగించడంలో నిర్లక్ష్యం వహించారని తెలిపారు.

అదేవిధంగా కళ్యాణ వేదిక వద్ద పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరుగుతున్నాయని అప్పుడప్పుడు శుభ్రం చేయించాలని ఆ ప్రాంతంలో టీటీడీ కల్యాణ మండపం ఉన్నందువల్ల ఇక్కడ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయని పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్నందువల్ల విషపురుగుల వల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తాయని కావున ఈ సమస్యలను తీర్చాలంటూ ఆయనకు తెలియజేశారు.

ఆంధ్ర భద్రాచలం కావడం చేత పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు రామయ్యను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారని ఆ సమయంలో ఆలయం వద్ద బస చేసేందుకు మౌలిక సౌకర్యాలు తక్కువగా ఉన్నాయంటూ ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. అనంతరం టిటిడి జేఈవో స్పందించి ఈ సమస్యలన్నీ తమకు తెలుసునని సత్వరమే పరిష్కరిస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్నత స్థాయి, ఆలయ టిటిడి సిబ్బంది తదితరులు ఉన్నారు.

Related posts

A big question: ఆ 23 మంది గెలిస్తే ఎలా?

Satyam NEWS

శ్రీవారి సేవ‌లో ఎంపీ సీఎం

Sub Editor

ఆసియా కప్: ఫైనల్ మ్యాచ్ లో ‘‘మెరుపు తీగ’’ పై చర్చ

Satyam NEWS

Leave a Comment