ఈ నెల 31న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం జరగనున్నది. ఫిబ్రవరి 4న రథసప్తమిని పురస్కరించుకొని తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీ జరగనున్నది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్వర్యంలో రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు పై అధికారులకు పలు సూచనలను చైర్మన్ బీఆర్ నాయుడు చేయనున్నారు. రథసప్తమి నాడు ఏడు వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శనమివ్వనున్నారు. జనవరి 8న తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈ సారి పటిష్ఠమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ఫిబ్రవరి 3 నుండి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. ఫిబ్రవరి 4న పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు, అన్ని ప్రివిలైజ్ దర్శనాలను రద్దు చేశారు.
previous post