గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. మంగళవారం పద్మాక్షి గుడి గుండం దగ్గర వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి నవరాత్రులు అనంతరం నిమజ్జనానికి వెళ్లే సమయంలో పోలీసు వారి సూచనలు పాటిస్తూ నిమజ్జనం పూర్తి చేసుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజక ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.నగరంలో గత రెండు మూడు సంవత్సరాలుగా మట్టి వినాయకుల పై అవగాహన కలిగిస్తుండడంతో ఈ ఏడాది 90 శాతం మట్టి వినాయకుని నెలకొల్పి పూజ చేశారన్నారు.పద్మాక్షి గుండంలో 156 ఐదు ఫిట్ల లోపు వినాయకులను నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో పూర్తిచేశామని అన్నారు.ముఖ్యంగా గజన మండలి యువకులు వినాయకుని తరలిస్తూన్న తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవలని సూచించారు.వచ్చే యేడాది వందకు వంద శాతం మట్టి వినాయకులను నెలకొల్పేలగా చర్యలు తీసుకుంటామని మట్టి వినాయకుల మాత్రమే నిమజ్జననికి అవకాశం కల్పిస్తాం అన్నారు.అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవికిరణ్, ఏసీపీ శ్రీధర్,ఏసీపీ కిషన్,డిపిఅర్ఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
previous post