34.2 C
Hyderabad
April 19, 2024 21: 58 PM
Slider నిజామాబాద్

కామారెడ్డి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ఏర్పాట్లు పూర్తి

#KamareddyDist

జిల్లాలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా ఆస్పత్రితో పాటు సదాశివనగర్ పి.హెచ్.సీలలో వ్యాక్సినేషన్ ఏర్పాట్లను పరిశీలించారు. వెయిటింగ్, వ్యాక్సినేషన్, అబ్జర్వేషన్ రూములను, ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నేటి వ్యాక్సినేషన్ పంపిణీకి నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని సదాశివనగర్, బిక్కనూర్, జిల్లా ఆస్పత్రి, జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ అర్బన్ పి.హెచ్.సీలలో వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని తెలిపారు.

ఒక్కొక్క కేంద్రంలో 50 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి దపాలో వైద్య, ఐ సి డి ఎస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ చేస్తారని పేర్కొన్నారు. ప్రతి కేంద్రంలో వ్యాక్సినేషన్ చేసిన వ్యక్తికి 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచాలని సూచించారు.

జిల్లాలో వ్యాక్సినేషన్ టీములను రెండు టీములుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రంలో అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి కేంద్రానికి జిల్లా అధికారికి ఇంచార్జి బాధ్యత అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు.

ఏ తేదీన ఎవరు వ్యాక్సిన్ వేసుకోవాలో ప్రణాళిక తయారు చేశామన్నారు. జిల్లాలో మొదటి విడతలో 5214 మంది హెల్త్ కేర్ వర్కర్లకు 30 కేంద్రాలలో వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వ్యాక్సినేషన్ కొనసాగుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ యాది రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, రెవిన్యూ డివిజనల్ అధికారి శీను, జిల్లా వైద్య అధికారి డాక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో శీను, వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Related posts

నేరస్తులకు శిక్ష పడేలా పోలీసు దర్యాప్తు ఉండాలి

Satyam NEWS

కృష్ణాజిల్లాలో కరోనాతో ఆర్.యం.పి డాక్టర్ మృతి

Satyam NEWS

పవన్ తోనే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు…

Satyam NEWS

Leave a Comment