28.7 C
Hyderabad
April 20, 2024 07: 00 AM
Slider విజయనగరం

గ్రూప్- 1 మెయిన్స్ కు పక్కాగా ఏర్పాట్లు..ఎంత మంది హాజరవుతున్నారంటే…?

#VijayanagaramDist

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్ష కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించబడిన కేంద్రాలలో ఆ పరీక్ష జరగబోతోంది.

ఇందులో భాగంగా ఈ నెల 14 నుండి 20 వరకు విజయనగరం లెండి కాలేజ్ లో జరగనున్న గ్రూప్-1 మెయిన్ పరీక్షకు ఏర్పాట్లన్నీ పక్కాగా చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి గణపతి రావు అధికారులకు ఆదేశించారు. తన ఛాంబర్ లో ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు.

ఈ పరీక్ష  ఉదయం 10 నుండి 1 గంట వరకు జరుగుతుందని, 217 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని  తెలిపారు. అభ్యర్థులను 8.45 గంటల నుండి 9.45 వరకు కేంద్దం లోనికి అనుమతిస్తారని అన్నారు.  హాల్ టికెట్ తో పాటు ఏదయినా గుర్తింపు కార్డ్ ను తమతో తీసుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. 

మొట్ట మొదటి సారి ప్రశ్నాపత్రం టాబ్ ఆధారితంగా ఉంటుందని, అదనంగా టాబ్ లను ఏర్పాటు చేసుకోవాలని కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ కు సూచించారు. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని, మాస్క్, శానిటైజర్  తో అందరూ  హాజరు కావాలని అన్నారు.

కరోనా పేషెంటు ల కోసం ఒక ఐసోలాషన్ రూమ్ ను ఏర్పాటు చేయాలన్నారు.  వైద్య శాఖ వారు థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖ గట్టి బందోబస్త ను ఏర్పాటు చేయాలని సూచించారు. సీటింగ్ ఏర్పాట్లు, ఇన్విజిలేటర్లను, టాబ్ కనెక్షన్స్ కు విద్యుత్, జనరేటర్ ను కాలేజీ యాజమాన్యం ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ  పరిశీలకులు శంకర రావు, ఈశ్వరి, కలెక్టరేట్ ఏ ఓ  దేవ్ ప్రసాద్, బి సెక్షన్ సుపరింటెండ్ మహేశ్వర రావు, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఉగ్ర రూపం దాల్చిన గోదావరి నదీ ప్రవాహం

Satyam NEWS

చంద్రబాబుకు విశాఖ పర్యటనకు అనుమతి

Satyam NEWS

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

Satyam NEWS

Leave a Comment