37.2 C
Hyderabad
March 29, 2024 19: 23 PM
Slider విజయనగరం

గుంక‌లాం ఇళ్ల పట్టాల కార్య‌క్ర‌మానికి అడ్డంకులు రాకుండా చూడండి

#MLAKolagatla

ఈ నెల 30 సీఎం జ‌గ‌న్ విజ‌య‌న‌గ‌రం జిల్లాకు రానున్నార‌ని త‌న నియోజ‌క‌వ‌ర్గంలో రెండో సారి ప‌ర్య‌టిస్తున్నార‌ని స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు.

గ్రామ స‌చివాల‌య సిబ్బంది, పార్టీ నేత‌ల‌తో, జిల్లా అధికారుల‌తో సీఎం ప‌ర్య‌ట‌న‌, ల‌బ్దిదారులు త‌ర‌లింపు, బ‌స్సులు ఏర్పాటు వంటి అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతి పెద్ద‌ది అయిన గుంక‌లాం లే అవుట్ లో సీఎం జ‌గ‌న్ అర్హులైన పేద‌లకు ఇండ్ల పంపిణీ చేప‌ట్ట‌బోతున్నార‌ని…ఇందుకు అడ్డంకులు సృష్టించేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీ ఎద‌రు చూస్తోంద‌న్నారు.

అయితే ముందుగానే అర్డులను జిల్లా అధికారుల‌చే గుర్తించి…వారికి మాత్ర‌మే ఇండ్ల‌ను సీఎం పంపిణీ చేస్తార‌న్నారు. ఈ క్ర‌మంలోనే ఆ రోజు పంపిణీ కార్య‌క్ర‌మం స‌జావుగా జ‌రిగిందేకు గ్రామ స‌చివాల‌య సిబ్బంది జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు.

ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం…అందునా పేద‌ల ఇండ్ల పంపిణీ,దీనికి తోడు పార్టీ రాష్ట్రాధినేత ప‌ర్య‌ట‌న ఈ అంశాల‌ను దృష్టిలో పెట్టుకునే త‌మ పార్టీ నేత‌లు కూడా సహాయ కార్య‌క్ర‌మాలలో భాగ‌స్వాములు అవుతార‌ని ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల తెలిపారు. 

పట్టాల పంపిణీపై సంయుక్త కలెక్టర్ జి.సి.కిషోర్ కుమర్, జే. వెంకట రావు తో కలసి  సచివాలయ సిబ్బంది తో  కలక్టరేట్ లో సమావేశం నిర్వహించారు.   

పారదర్శకంగా,  మెరిట్ ఆదరంగా సచివాలయ  ఉద్యోగులను నియమించి చరిత్ర సృష్టించారని,  ఈ ఉద్యోగులంతా చిత్త శుద్ధితో పని చేసి ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని  నెరవేర్చాలని అన్నారు.   రాష్ట్రం లోనే అతి పెద్ద లే అవుట్ గుంకలాం అని,  లబ్దిదారులందరికి సంతోషం కలిగే ఈ కార్యక్రమాన్ని ఎలంటి  తప్పులు  జరగకుండా జరిగేలా  చూసే బాధ్యత సచివాలయ సిబ్బంది తీసుకోవాలని అన్నారు.

కొన్ని వార్డులను కలిపి జోన్లు గా  చేయడం జరిగిందని, వార్డ్, జోన్ ఇంచార్జ్ లుగా ప్రజా ప్రతినిధులను పెట్టడం జరిగిందని, వార్డ్ సచివాలయ సిబ్బంది వారితో సమన్వయం చేసుకోవాలని అన్నారు.  లబ్ది దారులంత  పేదవారు కనుక  వారికీ  రవాణా, భోజన సదుపాయాన్ని  కల్పించాలని అన్నారు.  

వార్డ్ వారీగా లబ్ది దారులను ఎంపిక చేసి వారికీ ఎక్కడ ఎన్ని గంటలకు బస్సు అను ఏర్పాటు చేస్తున్నది ముందుగానే తెలపా లన్నారు.   నియోజక వర్గంకార్పొరేషన్ పరిధిలో కొండ కరకాం, సారిక, జమ్మూ, గుంకలాం  4 ప్రాంతాల్లో లే అవుట్లను  వేయడం  జరిగిందని, ఈ పట్టాల పంపిణీ  కార్యక్రమానికి వారు కూడా వస్తారని  తెలిపారు.   

గుంకలాం లబ్ది దారులను, వారి కుటుంభ సభ్యులను  వారికీ కేటాయించిన ప్లాట్ నందు కుర్చోబెట్టాలని అన్నారు. మిగిలిన మూడు ప్రాంతాల  లబ్ది దారులను పబ్లిక్ మీటింగ్ నందు  కూర్చోబెట్టాలని అన్నారు.  

ప్రతి లబ్దిదారునికి వారి ప్లాట్ హద్దులు తెలియాలి:  జే.సి కిషోర్

సంయుక్త కలెక్టర్ జే.సి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ  గుంకలాం లే అవుట్ నందు 397  ఎకరాల్లో  12 వందల 301 ప్లాట్లను ఇవ్వనున్నామని, ఎలాంటి గందర గోళం లేకుండా  లబ్ది దారులను వారికి కేటాయించిన ప్లాట్ లలో కూర్చో బెట్టాలని అన్నారు. 

అబ్ది దారులను గుర్తించి, వారికి  సులువుగా తెలయాలనే  మొత్తం ప్లాట్లను ఎ నుండి ఎఫ్  వరకు 6 బ్లాక్స్  గా   విభజించడం జరిగిందన్నారు.  ఎవరికీ ఏ బ్లాక్ లో ఏ ప్లాట్ కేటాయించామో వివరాలను ఆయా వార్డ్ సచివాలయాలకు  సమాచారం ఇవ్వడం జరిగిందని, ఆ మేరకు లబ్దిదారులను రూట్లలో తీసుకు వెళ్ళాలని అన్నారు.

ఈ కార్యక్రమన్న బాధ్యతగా చేయాలని,   వార్డ్ కార్యకర్తలతో సమన్వయం  చేసుకొని జయప్రదం గావించాలని అన్నారు.  సంయుక్త కలెక్టర్ జే. వెంకట రావు, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్  ఎస్.ఎస్. వర్మ మాట్లాడుతూ  పట్టాలను తయారు చేయడానికి ఆదివారం సచివాలయ సిబ్బందిని గాయత్రి కాలేజీ వద్ద సమావేశం కావాలని అన్నారు.

 సోమవారం నాటికి పట్టాల  తయారి పూర్తి కావాలన్నారు.  పట్టాల పంపిణీ  పూర్తి అయ్యేవరకు ఏ ఒక్కరు సెలవులు పెట్టరాదని సచివాలయ సిబ్బందిందరూ కలసి పని చేయాలనీ అన్నారు.  ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు గ్రూప్ లో ఇస్తున్తామని, వెంటనే స్పందించాలని అన్నారు. ఈ సమావేశం సహాయ కలెక్టర్ కే. సింహాచలం, రెవిన్యూ డివిజినల్ అధికారి భవాని  శంకర్,  కార్పొరేషన్ వార్డ్ ఇంచార్జ్ లు, కార్యకర్తలు పాల్గొన్నారు

Related posts

Free Sample Lowing Blood Pressure Naturally Will High Blood Pressure Medicine Help Partially Clogged Arteries

Bhavani

జడివానలోనూ ఆగని నిత్యాన్నదాన సేవలు

Bhavani

జూన్ 17వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఉచిత ద‌ర్శ‌నం టోకెన్ల‌ జారీ

Satyam NEWS

Leave a Comment