38.2 C
Hyderabad
April 25, 2024 11: 56 AM
Slider వరంగల్

పదవ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

#mulugu

మే 23 నుండి నిర్వహించబోతున్న పదవతరగతి వార్షిక పరీక్షల  ఏర్పాట్లలో భాగంగా ఈరోజు ములుగు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో  చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డీఈవో జి.పాణిని మాట్లాడుతూ రెండు సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేయాలని ఆదేశించారు.

విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాటు చేయాలని సిఎస్, డివో లను జిల్లా విద్యాశాఖ అధికారి కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఈఓ సూచించారు. ఈ కార్యక్రమంలో  ఇంచార్జి ACGE అప్పని జయదేవ్, క్వాలిటీ కోఆర్డినేటర్ సుదర్శన్ రెడ్డి, DCEB కార్యదర్శి విజయమ్మ, ములుగు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు, ములుగు జిల్లా లోని పదవ తరగతి 21 పరీక్షా కేంద్రాలలో విధులు నిర్వహించే చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Related posts

మన రైతు

Satyam NEWS

గుండెపోటుతో టిఆర్ఎస్ నాయకుడు నాగేశ్వరరావు మృతి

Satyam NEWS

130 జ్యోతిరావ్ పూలే వ‌ర్థంతి

Sub Editor

Leave a Comment