29.2 C
Hyderabad
September 10, 2024 16: 27 PM
Slider ప్రత్యేకం

78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

#neerabkumarprasad

ఈనెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లున్నీ పటిష్టంగా చేయాలని ఆదేశించారు. అదే విధంగా అదేరోజు సాయంత్రం రాజ్ భవన్ లో జరగనున్న ఎట్ హోం కార్యక్రమానికి సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మొత్తం ఏర్పాట్లన్నిటినీ ప్రోటోకాల్ విభాగం,ఎన్టిఆర్ జిల్లా కలక్టర్ మరియు విజయవాడ మున్సిపల్ కమీషనర్లు సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు ఆయా శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజ్ భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం సహా ఇతర ప్రముఖ కార్యాలయాలు,చారిత్రిక భవనాలను విద్యుత్ దీపాలంకరణతో అలంకరించాలని సిఎస్ ఆదేశించారు. వర్షాకాలమైనందున  వర్షం వస్తే ఇబ్బంది కలగని రీతిలో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన(పొలిటికల్)ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ముందుగా మాట్లాడుతూ 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉ.9గం.ల నుండి ఉ.10.30 గం.ల వరకు 78వ స్వాతంత్ర్య దినోత్సన వేడుకలు జరగనున్నాయని తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించి వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటికై సర్కులర్ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

స్వాతంత్ర్య దినోత్స వేడుకల అనంతరం అదే రోజు సాయంత్రం 5గం.లకు విజయవాడ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ఉంటుందని అందుకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వర్చువల్ గా పాల్గొన్న శాంతి భద్రతల ఐజి శ్రీకాంత్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పోలీస్ శాఖ తరపును విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు వివరించారు. అదే విధంగా నగరంలో ట్రాఫిక్ నియంత్రణ ఇతర చర్యలు తీసుకుంటామని చెప్పారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వివిధ పోలీస్ కంటిన్జెంట్లచే సెరిమోనియల్ కవాతు తదితర అంశాలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వర్చువల్ గా పాల్గొన్నఎన్టిఆర్ జిల్లా కలక్టర్ సృజన మాట్లాడుతూ రానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్ల పనులు మొదలు పెట్టామని చెప్పారు. రీహార్సల్స్ నిర్వహించుకునేందుకు వీలుగా ఈనెల 5వ తేదీకి స్టేడియంను సిద్దం చేసి అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో స్టేడియంకు పెయింటింట్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.

మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పెద్దఎత్తున పారిశుధ్య పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యం వంటి ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి ఆహ్వాన పత్రికలు,ఎట్ హోం కు సంబంధించి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఆహ్వాన పత్రికలు ప్రముఖులందరికీ,అన్ని శాఖలకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్స వేడుకల్లో రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకై సంబంధిత సంక్షేమ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ వేడుకలను ప్రజలంతా  తిలకించేందుకు వీలుగా ప్రత్యేక వీడియో తెరలను ఏర్పాటు చేయడం తోపాటు ఆల్ ఇండియా రేడియో,దూరదర్శన్ సహా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయనున్నట్టు వివరించారు.

అదే విధంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలపై ముఖ్యఅతిధి వారికి సందేశం సిద్ధం చేయడంతో పాటు పటిష్టమైన పబ్లిక్ అడ్రస్ సిస్టం వంటి ఇతర ఏర్పాట్లన్నీ చేయనున్నట్టు సిఎస్ కు వివరించారు. ఇంకా ఈసమావేశానికి వర్చువల్ గా పాల్గొన్న రాష్ట్ర అగ్నిమాపక విభాగం డైరెక్టర్ మురళి మాట్లాడుతూ వేడుకల వేదిక వద్ద అవసరమైన అగ్నిమాపక యంత్రాలను ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుతామని వివరించారు. డిఎంఇ డా.నర్సింహం వైద్య ఆరోగ్య శాఖ పరంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై వివరించారు.

అలాగే రవాణా శాఖ కమీషనర్,ఎండి సిపిడిసిఎల్,ఉద్యానవన శాఖ కమీషనర్,సిఇ ఆర్డ్అండ్బి,ఎన్సిసిసి గ్రూప్ కమాండర్,డిజి సైనిక్ వెల్పేర్ తదితర విభాగాల అధికారులు వర్చువల్ గా పాల్గొని వారి శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై సిఎస్ కు వివరించారు.

Related posts

“వింగ్స్ ఆఫ్ పాషన్” ఆవిష్కరించిన గ్లోబల్ స్టార్ రాంచరణ్

Bhavani

ఆధ్యాత్మికతకు నెలవు వేణి సోంపురం పుష్కర ఘాట్

Sub Editor

భక్తి కీర్తనలతో తన్మయపర్చిన గీతా గోవిందం భజన మండలి

Satyam NEWS

Leave a Comment