ఫిబ్రవరి 2,3,4 తేదీలలో శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో జరగబోతున్న రథసప్తమి వేడుకలకు శ్రీకాకుళం జిల్లా పోలీసులు సకల ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పి కెవి రమణ, డిఎస్పి సిహెచ్ వివేకానంద సంయుక్తంగా పత్రిక సమావేశాన్ని నిర్వహించారు. రథసప్తమి వేడుకలు పురస్కరించుకొని భక్తుల 300(ఒక్కరికి),500(ఇద్దురు కి) రూపాయలలో దర్శనానికి అనుమతి, డోనర్, క్షీరాభిషేకం టికెట్లు ఉన్నవారు వారికి కేటాయించిన స్లాట్లు సమయాన్ని బట్టి దర్శనానికి రావాలని తెలిపారు.
సామాన్య భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకు జిల్లా ఎస్పీ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించి పటిష్టమైన భద్రత చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీకాకుళం పట్టణానికి సింహద్వారం,కొత్త రోడ్డు, పెద్దపాడు కూడలలో నుంచి ప్రవేశ మార్గాలు ద్వార దర్శనం నిమిత్తం ప్రవేశానికి అనుమతి కల్పించామని అదే విధంగా నవభారత్ జంక్షన్ మీదుగా ఎగ్జిట్ అయ్యే మార్గాన్ని నిర్దేశించామని తెలిపారు. దర్శనం నిమిత్తం వచ్చే భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన నియమాలు, క్యూ లైన్లు,వాహనాలు పార్కింగ్(కొయ్యన కన్నయ కొలనీ,ఏపిహెచ్పి కొలాని,అరసవిల్లి ఎంపీయుపి పాఠశాల,వాడాడ జంక్షన్) స్థలాలు,భక్తులు వచ్చే , వెళ్లే మార్గాలు, భక్తులు రద్దీ దృశ్య జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకున్న ట్రాఫిక్ మళ్లింపు చర్యలు, రెండు మూడు తేదీల్లో జరిగే సూర్య నమస్కారాలు, శోభయాత్ర, సాంస్కృతి కార్యక్రమాలు జరేగే ప్రదేశాలు ,వాటి పార్కింగ్ స్థలాలు, యొక్క పూర్తి వివరాలు శుక్రవారం నిర్వహించిన పత్రిక సమావేశంలో పోస్టర్ల ద్వారా వెల్లడించారు.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగానికి భక్తులు అందరు సహకరించాలని జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న ట్రాఫిక్ మళ్లింపు చర్యలు ప్రతి ఒక్కరు విధిగా పాటిస్తూ నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేసి రథసప్తమి వేడుక జయప్రదంగా నిర్వహణకు ప్రజలు జిల్లా పోలీసు శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం రథసప్తమి వేడుకలకు సంబంధించి ప్రవేశ, ఎగ్జిట్ మార్గాలు, వాహనాలు పార్కింగ్ స్థలాలు ,ట్రాఫిక్ మల్లిపు చర్యలు, ఆలయం ఓవరాల్ రూట్ మ్యాప్, క్యూ లైన్లు,తదితర అంశాలు తెలియజేసే పోస్టర్లును అదనపు ఎస్పీ ఎస్పీ కేవీ రమణ, డిఎస్పి సిహెచ్ వివేకానంద, ఎస్బి సిఐ ఇమ్యాన్యువల్ రాజు,టౌన్ సిఐ పి పైడిపినాయుడు ట్రాఫిక్ సిఐ నాగరాజు, ఆవిష్కరించారు.