32.7 C
Hyderabad
March 29, 2024 12: 27 PM
Slider విజయనగరం

బ్యాంకుల్లో క‌రోనా నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాలి

#VijayanagaramCollector

అన్ని బ్యాంకుల్లో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. డిఆర్‌డిఏ, ఎల్‌డిఎం, ఇత‌ర అధికారుల‌తో . బ్యాంకుల్లో  క‌రోనా నిబంధ‌న‌ల అమ‌లు, వైఎస్ఆర్ బీమా న‌మోదుపై స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, క‌ర్ఫ్యూ కార‌ణంగా బ్యాంకులు ర‌ద్దీగా ఉంటున్నాయ‌ని, అందువ‌ల్ల త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాల‌ని స్పష్టం చేశారు . అదేవిధంగా ఎటిఎంల వ‌ద్ద కూడా శానిటైజ‌ర్‌ను, టిష్యూ పేప‌ర్‌ను ఏర్పాటు చేయాల‌ని  బ్యాంకు ప‌నివేళ‌లు కుదించినందువ‌ల్ల‌, ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా, ఏటిఎంల‌లో త‌గినంత న‌గ‌దు నిల్వ‌లు ఉండేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

అలాగే  వైఎస్ఆర్ బీమా న‌మోదు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని  ఈ నెలాఖ‌రు లోగా శ‌త‌శాతం ల‌క్ష్యాల‌ను పూర్తి చేయాల‌న్నారు. గ‌తేడాది సుమారు 81 శాతం బీమా న‌మోదుతో మ‌న జిల్లా రాష్ట్రంలోనే మొద‌టి స్థానంలో నిలిచింద‌ని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా త‌మ ల‌క్ష్యాల‌ను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. 

ప్ర‌తిరోజూ బ్యాంకు కార్య‌క‌లాపాలు ముగిసిన త‌రువాత 12 గంట‌లు నుంచి  2 గంట‌లు వ‌ర‌కూ, వైఎస్ఆర్ బీమా న‌మోదుకు కేటాయించాల‌న్నారు. డీఆర్‌డీఏ సిబ్బంది ఈ వేళ‌ల్లోనే బ్యాంకులకు వెళ్లి, బీమా రెన్యువ‌ల్‌, న‌మోదు పూర్తి అయ్యేలా చూడాల‌న్నారు.

డీఆర్‌డీఏ పీడీ కె.సుబ్బారావు మాట్లాడుతూ, జూన్ 1 నుంచి కొత్త పాల‌సీ అమ‌ల్లోకి వ‌స్తుందని… దీనిని దృష్టిలో పెట్టుకొని, జిల్లాలో వైఎస్ఆర్ బీమా న‌మోదు, రెన్యువ‌ల్ ప్ర‌క్రియ‌ల‌ను ఏప్రెల్ 16 నుంచే మొద‌లు పెట్టామ‌ని చెప్పారు.

కరోనా కార‌ణంగా కొంత జాప్యం జ‌రుగుతోంద‌ని, ఈ నెలాఖ‌రు నాటికి పూర్తి చేస్తామ‌ని చెప్పారు . ఎల్‌డిఎం కె.శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, జిల్లా క‌లెక్ట‌ర్ ఇచ్చిన ఆదేశాల‌ను త‌క్ష‌ణ‌మే బ్యాంకుల్లో అమ‌లు చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

బీమా న‌మోదు కోసం ఉద‌యం 12 గంట‌లు నుంచి 2 గంట‌లు వ‌ర‌కూ స‌మ‌యాన్ని కేటాయించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. ఐఓబి, ఎస్‌బిఐ, గ్రామీణ బ్యాంకుల్లో కొన్ని సాంకేతిక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, వాటి ప‌రిష్కారానికి సంబంధిత అధికారుల‌తో మాట్లాడ‌టం జ‌రిగింద‌న్నారు.

బ్యాంకు ఉద్యోగుల్లో ధైర్యాన్ని నింపి, 45 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ టీకా వేయించ‌డానికి ఎంత‌గానో స‌హ‌క‌రించిన జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఈ సంద‌ర్భంగా ఎల్‌డిఎం కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Related posts

యుద్ధప్రాతిపదికన వేములవాడ లో వంద పడకల ఆసుపత్రి

Satyam NEWS

తెలంగాణ గంగ మూసి నది పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

జంకె వెంకటరెడ్డిని అభినందించిన వైసీపీ నేతలు

Bhavani

Leave a Comment