39.2 C
Hyderabad
March 29, 2024 13: 40 PM
Slider మహబూబ్ నగర్

ఆశ్రమ పాఠశాలల మౌలిక వసతుల పనులు పూర్తి చేయండి

#udaikumar

గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చేపట్టిన మౌలిక వసతుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేమాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు.

జిల్లాలో ఆ శాఖ ద్వారా గిరిజన వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో చేపట్టిన వివిధ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని వాటిని సమర్థవంతంగా నిర్వహించి గిరిజనుల విద్యను బలోపేతం చేకూర్చి గిరిజనులకు లబ్ధి చేకూర్చాలని అన్నారు.

విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం ఉండవద్దు

జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు మోత్తం 29 ఉన్నాయని వాటిలో విద్యనభ్యసించే 5006 మంది గిరిజన విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చాడాలని, అన్ని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని అన్నారు.

మిషన్‌ భగీరథ అధికారులు ప్రతి ఆశ్రమ పాఠశాలలో తప్పనిసరిగా తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన బాలికల విద్యాసంస్థల్లో సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా 30 కోట్ల 34 లక్షల రూపాయలతో చేపట్టిన  92 రకాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న బడ్జెట్ వివరాలను తెలియపరచాలని డిఈని ఆదేశించారు.

క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి

అలాగే విద్య పరంగా కొన్ని సూచనలు చేస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ గిరిజన విద్యార్థిని విద్యార్థులకు అందించాలంటే ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాలను పరిశీలించాలని స్కూల్ వారిగా యాక్షన్ ప్లాన్, స్పెషల్ క్లాసులు, తరగతి వారీగా, సబ్జెక్టు వారిగా యాక్షన్ ప్లాన్ తయారు చేసి విద్యా నైపుణ్యాలు మెరుగు పరచాలి అన్నారు.

గిరిజన దర్శిని వర్క్ బుక్ మూల్యాంకన పూర్తి వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాలు వారీగా ప్రతీ రోజు గిరిజన విద్యార్థిని విద్యార్థులకు అందించే బ్రేక్ ఫాస్ట్, మెనూ ప్రత్యేక తరగతి బోధన అన్ని వివరాలను ఫొటోస్ రూపంలో ఆన్లైన్ లింకు ద్వారా తనకు అన్ని వివరాలను పంపించాలన్నారు. పాఠశాలల్లో కావలసిన అన్ని రకాల మౌలిక వసతుల వివరాలను ప్రతి పాఠశాలను సందర్శించి సేకరించాలని అధికారులను ఆదేశించారు.

అన్ని చెంచు పెంటకు మిషన్ భగీరథ నీళ్లు

అన్ని చెంచు పెంటలకు మిషన్ భగీరథ ద్వారా 100% త్రాగు నీటిని అందించాలని మిషన్ భగీరథ ఈఈని ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనపై వచ్చే వారం సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిసిసి ద్వారా సరఫరా చేసే వస్తువులను మేనేజర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాలెండర్ ఆవిష్కరించారు. 317 జీవో ప్రకారం ఏజెన్సీ బదిలీ సమస్యల పరిష్కారంపై వినతి పత్రాన్ని ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ కు అందజేశారు.

ఈ  సమావేశంలో ఐటీడీఏ పీవో అశోక్, మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్ రావు, ఆర్డిఓ పాండు నాయక్, ఏటీడీవో కైలాష్ రెడ్డి, గిరిజన సంక్షేమ డిఈ వెంకటేశ్వర్ సింగ్ gcc మేనేజర్ సంతోష్, ఏఈలు ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గిరిజన వసతి గృహాల వార్డెన్ లు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

అనాథ పిల్లలకు స్వెటర్స్ పంచిన అనురాగ్ హెల్పింగ్ సొసైటీ

Satyam NEWS

బూర్గుల్ దళిత బాధితులకు వెంటనే న్యాయం చేయాలి

Satyam NEWS

నేను వ్యాక్సిన్ తెప్పిస్తే మరి మీరెందుకు?

Satyam NEWS

Leave a Comment