27.7 C
Hyderabad
April 20, 2024 02: 52 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ ఆరోగ్య కేంద్రంలో గర్భిణి స్త్రీలకు సకల సౌకర్యాలు

#healthcenter

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎంసీఏ సెంటర్ లో గర్భిణీ స్త్రీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు MCH సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తెలియజేశారు. రెగ్యులర్ గా ANC చెకప్ లు, రక్త హీనత ఉన్న గర్భిణి స్త్రీలకు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్, ఐరన్ మాత్రలు  ఇస్తూ వారిలో సరిపడ రక్తం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా గర్భిణి స్త్రీలకు  వైద్య సేవలు కూడా అందిస్తున్నట్లు ఆయన వివరించారు. స్కానింగ్  మరియు సాధారణ కాన్పులు అత్యవసర సిజేరియన్లు కూడా చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. కొల్లాపూర్ తాలూకా  గర్భిణీ స్త్రీలు మాతా శిశు ఆరోగ్య కేంద్రం కొల్లాపూర్ లో  ఈ వైద్య సేవలు  నిరంతరంగా పొందేందుకు కూడా వీలుకల్పించారు. అవసరమైన వారు కేంద్రాన్ని సందర్శించాలని ఆయన కోరారు.

Related posts

ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర పై వ్యాసరచన పోటీలు

Satyam NEWS

మహిళలను విస్మరిస్తే  అభివృద్ధి సాధించడం సాధ్యం కాదు

Murali Krishna

సీఎం జ‌గ‌న్ జ‌న్మ‌దినం.. పార్టీ సేవా కార్య‌క్ర‌మాలు

Sub Editor

Leave a Comment