28.7 C
Hyderabad
April 20, 2024 08: 13 AM
Slider వరంగల్

26 న భారత్ బంద్ జయప్రదం చేయాలని వామపక్షాల బైక్ ర్యాలీ

#Bike Rally

ములుగు జిల్లా కేంద్రంలో వామపక్షాల రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండలం పసర నుండి నుండి వెంకటాపూర్ మండలం మీదుగా ములుగు జిల్లా కేంద్రానికి బైక్ ర్యాలీ జరిగింది.

ఈ ర్యాలీని ఉద్దేశించి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జంపాల రవీందర్ అఖిలభారత రైతుకూలి సంఘం జిల్లా కార్యదర్శి మొగిలి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల కాలంలో రైతు కార్మిక విధానాల్లో అవలంబిస్తూ పబ్లిక్ రంగాన్ని రైల్వే ఎల్ఐసి అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తున్నారని అన్నారు.

వ్యవసాయ ఆర్డినెన్స్ పేరుతో మూడు చట్టాలు తెచ్చి రైతుల్ని కార్పొరేట్ శక్తులకు అప్ప చెబుతున్నారని, ప్రధాని అవలంబిస్తున్న ప్రపంచ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దళిత మైనార్టీ పై దాడులకు నిరసనగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ,రైతు సంఘాలు గ్రామీణ భారత్ బందుకు పిలుపునిచ్చాయని తెలిపారు.

ఈ బందు ను ములుగు జిల్లా ప్రజానీకం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గపూర్ భాష ,చిట్టిబాబు, అంజాద్ భాష ముత్యాల రాజు ,బొమ్మ డా సాంబయ్య ,తీగల ఆదిరెడ్డి గుండు రామస్వామి సారంగపాణి గిఫ్ట్ నాయకులు సి ఐ టి యు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అల్వాల ఐలయ్య కరగటం సమ్మయ్య ,సప్పిడి యాది రెడ్డి, బొట్ల రాజన్న మామిడి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Farmers day : నేలకొరుగుతున్న అన్నదాతలు ఎందరో

Satyam NEWS

దళిత సంక్షేమానికి నిధుల కోత పెట్టిన మోడీ ప్రభుత్వం

Satyam NEWS

ఆదిలాబాద్ రిమ్స్ లో మరో అఘాయిత్యం

Satyam NEWS

Leave a Comment