33.2 C
Hyderabad
April 26, 2024 02: 31 AM
Slider రంగారెడ్డి

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటియేషన్ కార్డులు

#medchal

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ అక్రిడిటియేషన్ కార్డులు అందచేస్తామని జిల్లా కమిటీ సమావేశంలో అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. గురువారం జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ పలు తీర్మానాలు చేసింది.

ఈ మేరకు 2022– -2024 రెండేళ్ళకు గాను కొత్తగా  అక్రిడిటేషన్ల కోసం దరఖాస్తు సమర్పించేందుకు, జారీ చేసేందుకు ఆన్ లైన్ ద్వారా ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించినట్లు అందుకు అనుగుణంగా జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ తదితర మీడియాల్లో విధులు నిర్వహిస్తున్న  జర్నలిస్టులు ఆన్ లైన్ లో చేసుకొన్న దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా  అర్హులకు విద్యార్హత  సర్టిఫికెట్, అనుభవం కలిగిన సర్టిఫికెట్లను పరిశీలించారు.

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆన్ లైన్ ద్వారా 851 దరఖాస్తులు వచ్చాయని… జర్నలిస్టులు చేసుకున్న దరఖాస్తులలో అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయుటకు కమిటీ ఆమోదించింది. జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీలో ఆయన ఆమోదించే విధంగా అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వచ్చేలా ఆన్ లైన్  lo అప్ లోడ్ చేయాలని జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి (డీపీఆర్వో) కిరణ్ కుమార్ తెలిపారు.

అలాగే వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న అక్రిడిటేషన్ కోసం చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా  పరిశీలించి, అర్హత ఉన్న దరఖాస్తులను ఆమోదించి, సంబంధించిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీచేసేందుకు  జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటి సభ్యులు అంగీకరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ సమావేశంలో జిల్లా పౌరసంబంధాల శాఖ (డీపీఆర్వో) కిరణ్ కుమార్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు వి.రామారావు, (నమస్తే తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్), కె. వెంకటేశ్వర్లు,(సాక్షి అసిస్టెంట్ చీఫ్ రిపోర్టర్), మెరుగు చంద్రమోహన్, (మీడియా ఎక్స్ ప్రెస్ ఎడిటర్), ఎం.వెంకట్ రెడ్డి, (జనం సాక్షి రిపోర్టర్), సముద్రాల కిరణ్, స్వాతిముత్యం (డైలీ రిపోర్టర్), బొమ్మ అమరేందర్, (ఏవీ న్యూస్ ఛానెల్ హెడ్ ఓడి), జి.ముత్తయ్యగౌడ్, (టీఎస్–9 జర్నలిస్టు), కె.సాయిబాబా, (వెలుగు ఫొటోగ్రాఫర్) తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ రవి గుప్తా?

Murali Krishna

టీటీడీ పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా హుజూర్ నగర్ వాసి

Satyam NEWS

సైబర్ నేరాన్ని ఛేదించిన ములుగు సైబర్ పోలీసులు

Satyam NEWS

Leave a Comment