27.7 C
Hyderabad
April 25, 2024 09: 51 AM
Slider కడప

మహమ్మారి వ్యాపించకుండా కట్టు దిట్టమైన చర్యలు

Rajampet RDO

కడప జిల్లా రాజంపేట ఆర్డీవో ధర్మా చంద్రారెడ్డి తన కార్యాలయంలో మంగళవారం కరోనా లాక్ డౌన్ కర్ఫ్యూ పై మీడియా తో మాట్లాడారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని 17 మండలాల్లో తగు జాగ్రతలు తీసుకుంటున్నామన్నారు.

గల్ఫ్ దేశాల నుంచి ఇప్పటి వరకు 14 వందల 81 మంది రాజంపేట లోని వివిధ మండలాలకు చేరుకున్నారని తెలిపారు. వారి ఇండ్ల వద్దకు వైద్య, రెవెన్యూ వాలంటీర్లు చేరుకొని వారికి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. వారిలో కరోనా లక్షణాలు లేవని, వీరిలో ప్రతి పది మంది కి ఓ స్పెషల్ ఆఫీసర్ ని పర్యవేక్షణ గా నియమించామని తెలిపారు.

వారిని పర్యవేక్షణ చేసి బయట తిరగకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో భవిష్యత్ అవసరాల ను దృష్టిలో పెట్టుకొని కామన్ క్వారెంటైన్ లు ఏర్పాటు చేస్తామని, బద్వేలు లో విఆర్ కాలేజీ లో రాజంపేట కు సంబంధించి అనంత రాజంపేట లోని హార్టికల్చర్ యూనివర్సిటీలో 64 గదులు 128 మందికి కామన్ క్వారెంటైన్ ఏర్పాటు చేశామని అన్నారు. వారికి ఆహారం బెడ్లు ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు చేపట్టామని వివరించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే చర్యలు తప్పవని ఈ మేరకు తాసిల్దార్ లకు ఆదేశాలు జారీచేశామని తెలిపారు. జాతరలు, సభలు, సమావేశాలకు అనుమతి రద్దు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాలేదని తెలిపారు.

Related posts

రాజంపేటలో జగనన్నే మా భవిష్యత్తు,మా నమ్మ కం…

Bhavani

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనిపెట్టిన నాసా

Satyam NEWS

తెలంగాణలో తవుడునూనె మిల్లుల ఏర్పాటుకు ప్రాధాన్యత

Satyam NEWS

Leave a Comment