27.7 C
Hyderabad
April 26, 2024 03: 38 AM
Slider నల్గొండ

ప్రజానాట్య మండలి మూడవ మహాసభలను జయప్రదం చేయండి

#prajanatyamandali

ఈనెల 28,29 తేదీలలో రోజుల పాటు  మిర్యాలగూడ రోడ్డులో గల అమర కళాకారుల ప్రాంగణం సిపిఐ కార్యాలయంలో జరుగుతున్న తెలంగాణ ప్రజా నాట్య మండలి సూర్యాపేట జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయాలని ప్రజా నాట్య మండలి ప్రధాన కార్యదర్శి దొంతగాని సత్యనారాయణ పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ప్రజా నాట్య మండలి ఇన్చార్జ్ పాలకూరి బాబు అధ్యక్షతన జరిగిన ప్రజానాట్య మండలి కళాకారుల సమావేశంలో ప్రజా నాట్య మండలి ప్రధాన కార్యదర్శి దొంతగాని సత్యనారాయణ మాట్లాడారు.

1943వ,సంవత్సరంలో ఆవిర్భవించిన ప్రజానాట్యమండలి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో విస్తృతంగా స్వాతంత్య్రఆకాంక్షను ప్రజలకు వివరించిందని తెలిపారు. బాంచన్ దొర కాల్మొక్తా’ అని అణిగి మణిగి ఉన్న సామాన్యుడు నిజాం మూకల మీద తిరగబడి  భూమికోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం చేతికందినదల్ల పట్టుకొని అట్టడుగు ప్రజలు ఉప్పెనలా లేచాడని తెలిపారు.

నిజాంను,వారి అనుచర గణాన్ని జమీందారులను,జాగీర్దారులను రాష్ట్రేతర ప్రాంతాలకు తరిమికొట్టి పోరాటాలను సాగించిన సందర్భం అది అని అన్నారు. ఈ మహత్తర పోరాటానికి మద్దతుగా గొల్ల సుద్ధులు,ఒగ్గు కథలు,బుర్ర కథలు,ప్రజా చైతన్య గీతాలతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉత్తేజాన్నిచ్చి ప్రజలలో ఉన్న భయాన్ని పటాపంచలు చేసి,ఉద్రేకాన్ని నూరిపోసి పోరాటబాటలో నడిపించింది ప్రజానాట్యమండలి అన్నారు.

అంతటి ఘన చరిత్ర కలిగిన ప్రజా నాట్య మండలి సూర్యాపేట జిల్లా మూడవ మహాసభలు ఈనెల 28,29వ, తేదీలలో ఆది, సోమవారాలలో హుజూర్ నగర్ పట్టణం లోని మిర్యాలగూడ రోడ్డులో గల అమర కళాకారుల ప్రాంగణం సిపిఐ కార్యాలయంలో జరుపుతున్న సందర్భంగా తెలుగు సాంస్కృతిక రంగాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు కలాలను, గళాలను కదిలించిందని అన్నారు. స్వార్థ సంకుచిత, దోపిడీ వర్గ శక్తులు సృష్టిస్తున్న దోపిడిలో శ్రమజీవుల జాతి ఔన్నత్యాన్ని ఉత్తమ కళాత్మక విలువలను నిలబెట్టేందుకు తమ శక్తి మేర శ్రమిస్తూ ప్రజానాట్యమండలి ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధులు సిపిఐ పార్టీ నాయకులు,కళా రంగాల ప్రముఖులు తెలంగాణ ప్రజానాట్యమండలి సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు,ప్రజానాట్యమండలి కళాకారులు యల్లావుల రాములు, కంబాల శ్రీను,గుండు వెంకటేశ్వర్లు, యాల్లావుల రమేష్,గోపనబోయిన వెంకటేశ్వర్లు,జొన్నలగడ్డ గోవిందు,కస్తాల వీరబాబు,గొట్టెముక్కల రాములు, జక్కుల వెంకటేశ్వర్లు,అఖిల, శైలు,నాగమణి,శ్వేత తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బడ్జెట్ లో విద్యా రంగ కేటాయింపు నిరాశాజనకం

Satyam NEWS

అంబేద్క‌ర్ విగ్ర‌హానికి నివాళులు అర్పించిన పోలీస్ బాస్ లు

Satyam NEWS

విద్యార్ధులకు స్టూడెంట్ పోలీస్ క్యాడేట్ (SPC) శిక్షణ

Satyam NEWS

Leave a Comment