28.7 C
Hyderabad
April 20, 2024 08: 59 AM
Slider శ్రీకాకుళం

మహిళల భద్రతకు దిశ యాప్ కవచం లా పనిచేస్తుంది

#srikakulam

శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పక్కి సురేఖ

మహిళలు భద్రత మరియు రక్షణకు దిశ యాప్ ఒక కవచం వలే పనిచేస్తుందని…ప్రతీ ఒక్కరూ విధిగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పక్కి సురేఖ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్పెషల్ బ్రాంచ్ పోలీస్ విభాగం ఏర్పాటు చేసిన దిశ యాప్ డౌన్లోడ్ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ ఏర్పాటు చేసిన దిశ యాప్ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల రక్షణకు,భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు..కేంద్రప్రభుత్వం దిశ చట్టానికి సత్వరమే పార్లమెంటు ఆమోద ముద్ర వేయాలని కోరారు…

ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఒక రక్షణగా నిలుస్తుందని స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు అన్నారు.దిశ యాప్ గురించి అపోహలు వొద్దు అని ,ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసికోవాలని ఆయన సూచించారు…

మహిళలు భద్రత కోసమే దిశ యాప్ రూపొందించారని …శ్రీకాకుళం జిల్లాలో ఈ ఒక్కరోజు 30వేల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేయాలని ఎస్పీ నిర్ణయం తీసికోవడం పట్ల సిక్కోలు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు… ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ జి.ఇందిరాప్రసాద్, ఎం.మల్లిబాబు, గోలీ సంతోష్, గోలీ ఉమామహేశ్వర రావు,నల్లబాటి కృష్ణమూర్తి, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది సోమేశ్వర రావు,రేణుక,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్రిస్టియన్లకు నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బట్టల పంపిణీ

Satyam NEWS

సరిహద్దు వివాదాల్లో పాకిస్తాన్ ప్రభావంతో వ్యవహరించవద్దు

Satyam NEWS

హైదరాబాదులో ఐటీ సోదాలు

Satyam NEWS

Leave a Comment