28.7 C
Hyderabad
April 25, 2024 04: 22 AM
Slider నల్గొండ

ఈ నెల 9న కలెక్టర్ కార్యాలయ ముట్టడికి పార్టీలకు అతీతంగా కదలి రావాలి

#hujurnagar protest

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం సమర్పణలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి,ఎంపిపి గూడెపు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు తదితర ముఖ్య నాయకులకు వినతి పత్రాలు అందజేశారు.

అనంతరం జిల్లా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె వెంకటరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోతన బోయిన హుస్సేన్ తదితరులు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రజా,కార్మిక,రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారతదేశాన్ని కాపాడాలని,ఇందులో భాగంగా టిఆర్ఎస్ పార్టీ గతంలో మాదిరిగానే కేంద్రంలో బిజెపి కి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు.

రైతు వ్యతిరేక,కార్మిక వ్యతిరేక చట్టాలు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డిజిల్,వంటగ్యాస్ ధరలు పెంచటం,సరళీకరణ దూకుడుగా అమలు చేయడం గత ఏడు సంవత్సరాల కాలంలో 70 సంవత్సరాలు పైగా ఎంతో అభివృద్ధి చెందిన వేలకోట్ల ప్రభుత్వ సంస్థలను పెట్టుబడిదారులకు,ప్రైవేటు పరం చేయడం అన్యాయమని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈనెల 9న,చలో కలెక్టరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా తరలిరావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలక సోమయ్య గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నాగారపు పాండు,కాసాని వీరస్వామి,సి ఐ టి యు నాయకులు ఉపతల వెంకన్న, జక్కుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

4 కోట్ల 31 ల‌క్ష‌ల విలువైన జ‌గ‌న‌న్న విద్యాదీవెన చెక్కు  పంపిణీ

Satyam NEWS

2024లో టిడిపి లీడింగ్ వార్తతోనే అరాచకశక్తుల పరార్!

Satyam NEWS

తనను తాను తీర్చిదిద్దుకున్న ఏవీఎస్ ప్రదీప్

Satyam NEWS

Leave a Comment