39.2 C
Hyderabad
April 25, 2024 18: 36 PM
Slider నల్గొండ

దేశవ్యాప్త హర్తాళ్ ను జయప్రదం చేయండి

#Congress Party

రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ  ఆదేశాల మేరకు  టీ.పీ.సీ.సీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన మేరకు డిసెంబర్ 8న జరప తలపెట్టిన బంద్ లో అందరూ పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సమావేశంలో  టి పి సి సి జాయింట్ సెక్రెటరీ యం డి అజీజ్ పాషా మాట్లాడుతూ  దేశ రాజధాని ఢిల్లీలో గత 12 రోజులుగా రైతుల నిరసనలు జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తుందని ధ్వజ మెత్తారు. అంబానీ, ఆదానీ లాంటి బడా పెట్టుబడిదారులకు పాలకులు దాసోహం అవుతున్నారని విమర్శించారు. గడిచిన 12 రోజులుగా రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాల వల్ల దేశ ప్రజలకు నష్టం జరుగుతుందని, రైతు ప్రతినిధులతో జరిగిన చర్చలను ఉద్దేశ్యపూర్వకంగా నే విఫలం చేశారని అన్నారు. రైతులు తమకు అన్యాయం చేయొద్దని వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్ట వద్దని పోరాడుతుంటే వారిపై పోలీసులతో దమనకాండ చేయించడం అన్యాయమన్నారు.

రైతులపై దమనకాండ అన్యాయం

వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు ఢిల్లీ నగరానికి చేరుకుంటున్న రైతులను అడ్డుకోవడం సరికాదన్నారు. రైతు సంఘాల నేతలతో చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ,ప్రజా సంఘాలు అన్ని ,వర్గాల ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.  అందులో భాగంగానే డిసెంబర్ 8న, జరుగుతున్న భారత్ బంద్ ను జయప్రదం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సంపూర్ణ  మద్దతు ఇస్తుందని, వర్తక, వాణిజ్య సంఘాల వారు అందరూ కూడా బంద్ కు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,sk. బిక్కన్ సాహెబ్, సమ్మెట సుబ్బరాజు, కోల మట్టయ్య,దొంతగాని జగన్, సైదులు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

విలువల దర్పణం

Satyam NEWS

కేజీబీవీ అధ్యాపకులకు పనికి తగ్గ వేతనం కల్పించాలి

Satyam NEWS

హైదరాబాద్ లో రేవ్ పార్టీ

Sub Editor 2

Leave a Comment