24.7 C
Hyderabad
March 29, 2024 06: 02 AM
Slider ముఖ్యంశాలు

ఈ నెల 12 న విశాఖ లో జరగనున్న పీఎం మోడీ సభను జయప్రదం చేద్దాం

#botsa

విశాఖలో ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ప్రధాని నరేంద్ర మోడీ సభను ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైయస్ కాంగ్రెస్పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. విజయనగరంలోని సుజాత కన్వెన్షన్ లో జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ స్ఫూర్తితో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా మరో రెండు అడుగులు ముందు కేసి సీఎం జగన్ పని చేస్తున్నారని అన్నారు. ఈనెల 12వ తేదీన 12 వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు సీఎం జగన్ అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనున్నాయన్నారు.

ఈ సభకు విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్ కోట, చీపురుపల్లి నియోజకవర్గం పాటు , ఎచ్చెర్ల, ఆముదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున తరలి వెళ్లి మన వాణి నీ వినిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాబోయే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలు లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. విజయనగరం ఉమ్మడి జిల్లాలో కూడా 9 అసెంబ్లీ స్థానాలలో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. విజయనగరంలో టిడిపి నాయకులు పగటి వేషగాలుగా తిరుగుతున్నారని అన్నారు.

మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడే తీరు సరికాదన్నారు. అశోక్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. అశోక్ భ్రమలో ఉన్నారని అన్నారు. సంక్షేమానికి మారుపేరు ఆంధ్రప్రదేశ్ అని, భారతదేశమంతా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తోందని అన్నారు. ఏ టువంటి దళారులు, దోపిడి విధానం లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. పట్టణ, జిల్లా అభివృద్ధి విషయంలో చర్చకు రండి అని అన్నారు.

అభివృద్ధి జరిగింది అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాములో జరిగిందని అన్నారు. అశోక్ గజపతి రాజుకు పేదవాడి కష్టం తెలియదని అన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యతిస్తోందని అన్నారు. అశోక్ గజపతి రాజు చెట్ల కింద కూర్చుని ప్రకటనలు చేయడం కాదని, ప్రజల్లోకి వస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రధాని బహిరంగ సభకు భారీ ఎత్తున తరలి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని, మన ప్రాంత వానిని, ప్రయోజనాలను సాధించుకునేందుకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. 12వ తేదీన విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి, ఉదయం 7 గంటల నుంచి పార్టీ శ్రేణులు వారికి కేటాయించిన బస్సులలో బయలుదేరాలన్నారు.

రాష్ట్రంలోనే విజయనగరం నియోజకవర్గ అభివృద్ధి ముందుంది అని అన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పనలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతున్నారని అన్నారు. పట్టణ ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా 2024 కల్లా తారకరామ తీర్థ సాగర్ పూర్తవుతుందని అన్నారు.

అది కూడా తమ ప్రభుత్వం ప్రారంభిస్తుంది అని అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపనకు అన్ని అనుమతులు వచ్చాయని అన్నారు. అశోక్ గజపతి రాజు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ప్రజలను మభ్య పెట్టారని అన్నారు. అన్ని అనుమతులతో భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన, ప్రారంభోత్సవం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరుగుతుందని అన్నారు.

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో విజయనగరం నియోజకవర్గంలో 17,856 ఓట్లను పార్టీ నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధుల సహకారంతో నమోదు చేయడం జరిగిందని అన్నారు. పార్టీ ఏ పిలుపు ఇచ్చిన కష్టపడి పని చేస్తారని నిరూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.

12వ తేదీన విశాఖపట్నం జరిగే బహిరంగ సభ కు భారీ ఎత్తున హాజరై సీఎం జగన్ పరిపాలనకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. విజయనగరం నియోజకవర్గానికి వంద బస్సులు కేటాయించడం జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్టిష్టంగా ఉన్నది అన్నందుకు నిదర్శనం గడపగడపకు కార్యక్రమం అని, ప్రజా స్పందన బాగుందని అన్నారు.

ప్రతిపక్ష పార్టీకి అడ్రస్ లేని పరిస్థితి ఉందన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తమ ఉనికిని చాటుకోవడానికి ప్రతి సోమవారం పదిమందితో కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్ కి వెళ్లి ఆర్జీ ఇవ్వడం అలవాటైపోయిందని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వార్డ్ కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అధికారం ఉన్న, అధికారం లేకపోయినా ప్రజల మధ్య ఉండే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన 12వ తేదీన విశాఖలో జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభకు జిల్లా నుంచి 50 వేల మందికి పైగా తరలిరావాలన్నారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలో 460 కోట్ల రూపాయలతో 8 ఎకరాలలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు పనులు త్వరలో పూర్తవుతోందని అన్నారు .అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారని అన్నారు.

విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జ్ నెక్కల నాయుడు బాబు మాట్లాడుతూ విశాఖ బహిరంగ సభను విజయనగరం నియోజకవర్గ నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. శాసనమండలి సభ్యులు డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు వృద్ధాప్యంలో ఉన్నారని, ఆయన మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.

ఈ సందర్భంగా నగరంలోని మూడో డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ వజ్రపు సత్య గౌరీ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావుల సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నగర పార్టీ అధ్యక్షుడు ఆసపు వేణు అధ్యక్తన జరిగిన సమావేశంలో నగర మేయర్ వెంపటాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఫ్లోర్ లీడర్ ఎస్ వి వి రాజేష్, మండల పార్టీ అధ్యక్షులు నడిపేనా శ్రీనివాసరావు, విజయనగరం జడ్పిటిసి సభ్యులు కే శ్రీనివాసరావు, జోనల్ ఇన్చార్జులు రాంపండు, డాక్టర్ వి ఎస్ ప్రసాద్, తవిటి రాజు, బొద్దాన అప్పారావు, ముచ్చు శ్రీనివాసరావు, ఈశ్వర్ కౌశిక్, బోడసింగి ఈశ్వరరావు, రెడ్డి గురుమూర్తి, గుజ్జల నారాయణరావు, అల్లు చాణిక్య, కాళ్ల సూరిబాబు, యవర్ణ కుమారస్వామి, దుబే, తమ్ము, కే ల్ల త్రినాధ్, నారం శెట్టి సత్తిరాజు లతోపాటు నియోజకవర్గ నుంచి పెద్ద ఎత్తున పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, యువజన, విద్యార్థి విభాగాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

ఒకడు పోయాడు…. మరొకడు పోతాడు

Satyam NEWS

ఎన్టీఆర్ పేరు మార్పు పై సర్వత్రా నిరసనలు

Satyam NEWS

ఆసిఫాబాద్ ఎస్పీని బదిలీ చేయండి: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

Satyam NEWS

Leave a Comment