27.7 C
Hyderabad
April 26, 2024 04: 34 AM
Slider నల్గొండ

8న జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

#roshapati

కనీస వేతన జీఓ ల సాధన కోసం, నాలుగు లేబర్ కోడ్ ల రద్దు కోసం జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కార్మికులని కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం  సిఐటియు ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని వివిధ  పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మిక సంఘాల ప్రచారంలో భాగంగా రోషపతి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం,రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని, బడా పెట్టుబడిదారుల గురించి,పరిశ్రమల గురించి ఆలోచిస్తూ వారి బాగు కోసం ఈ ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడిచినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని జీవోలను కొనసాగిస్తున్నారని అన్నారు. దేశ సహజ వనరులు,ప్రజా సంపదైన ప్రభుత్వరంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు తెగనమ్ముతున్నారని విమర్శించారు. ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు,73 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలు సాధించుకునేందుకు పోరాటం తప్ప మరో మార్గం లేదని అన్నారు.

తెలంగాణ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యూనియన్ అనుబంధాలతో నిమిత్తం లేకుండా యావత్ తెలంగాణ కార్మిక వర్గం కదం తొక్కి అక్టోబర్ 8వ,తేదీన జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులందరూ సంఘటితంగా పోరాడి మన హక్కులు సాధించుకోవడానికి అందరూ ఏకతాటిపైకి రావాలని అన్నారు. 

కార్మిక చట్టాల సవరణ గురించి, చట్టాల సవరణ గురించి వివిధ రూపాలలో అనేక ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునే నాధుడే లేని పరిస్థితి ఏర్పడిందని ఇది సరైంది కాదని విమర్శించారు. తక్షణమే కార్మిక చట్టాల సవరణ విడుదల చేయాలని,రైతు వ్యవసాయ 3 చట్టాలను రద్దు చేయాలని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు  చర్యలు తీసుకొని కనీస వేతనం 24000 వేల రూపాయలు ఇవ్వాలని,రైతు వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మెరిగ దుర్గారావు, ముత్తమ్మ,సైదులు,గోపి,కుమారు,వెంకన్న, కోటమ్మ, చంటి, క్రాంతి, గోవిందు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బంగారం స్మగ్లింగ్ కేసులో ఎయిరిండియా ఉద్యోగుల అరెస్ట్

Sub Editor

దాడికి గురైన సైదులు, సింగమోహన్ రావు లను పరామర్శించిన ఉత్తమ్

Satyam NEWS

భవిష్యత్తులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తా

Satyam NEWS

Leave a Comment