32.2 C
Hyderabad
March 29, 2024 21: 33 PM
Slider మహబూబ్ నగర్

ఆర్టీసీ సంస్థను రక్షించుకోవడానికి ప్రజలంతా సహకరించాలి

#rtc

ఆర్టీసీ సంస్థను రక్షించుకోవడానికి ప్రజలంతా సహకరించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ పేట మండలం జగ్గ్ బోయిన్పల్లి గ్రామంలో  ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి బస్ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఆదివారం పంచాయతీ వద్ద గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడానికి ప్రజలంతా కలిసి రావాలని సహకరించాలని ఆయన కోరారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకునే బాధ్యత మనందరిపై  ఉందని పేర్కొన్నారు.

ప్రైవేటు వాహనాలలో ప్రయాణం అంత మంచిది కాదని  ఇబ్బందులు పడకూడదని తెలిపారు.ఆర్టీసీలో ప్రయాణం మీ కుటుంబానికి భద్రత అన్నారు. కచ్చితమైన సమయపాలనతో  మీకు అందుబాటులో ఎప్పుడూ ఉంటుందన్నారు.బస్సుకోసం గంటల తరబడి ఎదురిచూసే పని లేకుండా బస్సు ఎక్కడున్నది? ఎప్పుడు వస్తుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘టీఎస్‌ ఆర్టీసీ బస్‌ ట్రాకింగ్‌’ పేరుతో గూగుల్‌ ప్లేస్టోర్‌లో మొబైల్‌ యాప్‌ను సంస్థ వైస్‌ చైర్మన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ 2022 జూలై 26న ప్రారంభించామన్నారు.ఈ కార్యక్రమంలో సదానందం గౌడ్ మల్లన్న సుందర్ శంకర్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గౌరి సేవాసంఘం, వెంకటపద్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 17 న మెగా ర‌క్త‌దాన శిబిరం

Satyam NEWS

గ్రూపు వన్ పరీక్షలు ప్రశాంతం

Satyam NEWS

క్రిమినల్ బ్యాచ్: పెళ్లాం సహకారంతో యువతికి ట్రాప్

Satyam NEWS

Leave a Comment