28.7 C
Hyderabad
April 25, 2024 06: 41 AM
Slider నల్గొండ

CITU సమావేశంలో పలు సమస్యలపై చర్చ, తీర్మానం

#Roshapati

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సరళీకరణ ప్రైవేటీకరణ దూకుడుగా అమలు చేస్తూ ప్రజల ఆస్తులను చౌకగా అమ్ముతుందని, దీనికి వ్యతిరేకంగా అన్ని పార్టీల వారు, మేధావులు స్పందించాలని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో  హుజూర్ నగర్ పట్టణ కమిటీ సమావేశం ఎలక సోమయ్య గౌడ్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలోని రైస్ మిల్లు డ్రైవర్ దిన కూలీల రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే అగ్రిమెంట్ పూర్తయినందున తిరిగి అగ్రిమెంట్ చేయుటకు రైస్ మిల్ యాజమాన్యం స్పందించాలని,నేడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు, అలవెన్సులు, రోజువారి కూలీ పెంచాలని కోరారు.

బిల్డింగ్ వర్కర్స్,రాడ్ బెండింగ్,సెంట్రింగ్, పెయింటర్, మున్సిపల్ వర్కర్స్, ఆటో కార్మికులు, రైస్ మిల్ డ్రైవర్ ని, దిన కూలీల అన్ని షాపుల గుమస్తాలు, తోపుడు బండి వర్కర్స్, తదితర కార్మిక సంఘాలు  పూర్తి సమీక్ష అనంతరం భవిష్యత్ కార్యచరణ తీసుకోవడం జరిగిందని అన్నారు.

హుజూర్ నగర్ పట్టణంలో ఈఎస్ఐ హాస్పిటల్ తక్షణం ఏర్పాటు చేయాలని, హైకోర్టు లాయర్ల జంట హత్యలపై నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, హుజూర్ నగర్ పట్టణంలో రోడ్లు వెడల్పు పనులు తొందరగా పూర్తి చేసి పాదచారులకు, ప్రజలకు, వీధి వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చేయాలని తీర్మానం చేయడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలక సోమయ్య గౌడ్, ఉపతల వెంకన్న, గోవిందు, మహిపాల్, కనకయ్య, నరేష్, గుండెబోయిన వెంకన్న, రాళ్లబండి మంగమ్మ, బుజ్జి, కోటమ్మ, దుర్గారావు, రాజేష్, వీరమ్మ, సైదులు, రాజు, రాము, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మొబైల్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రానికి విశేష స్పందన

Satyam NEWS

యువతా మేలుకో డ్రగ్స్ ను తరిమేద్దాం

Satyam NEWS

కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ

Satyam NEWS

Leave a Comment