రోడ్ ప్రమాదాల నివాణకు తమ శాఖ సిబ్బంది కూడా ఇక నుంచీ హెల్మెట్లు ధరించాల్సిందేనని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేసారు.వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గంట్యాడ,రూరల్ సర్కిల్ ఆఫీస్ ను పోలీస్ బాస్ ఆకస్మిక తనిఖీ చేసారు. మొన్నా మధ్య రూరల్ పీఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ, తాజాగా ఆ పక్కనే ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఉన్న నాటి పాత రూరల్ సర్కిల్ ఆఫీస్ ను విజిట్ చేసారు.ఈ సందర్భంగా ఆధునీకరించిన రూరల్ సర్కిల్ ఆఫీస్ ను ఎస్పీ ప్రారంభోత్సవం చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లో తరచూ రోడ్ ప్రమాదాలు అధికం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసారు.ఇందుకు పరిష్కార చర్యగా ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు.అందుకుముందుగా మా సిబ్బంది యావత్తూ హెల్మెట్ ధరించేలా ఉత్తర్వులు ఇస్తున్నాని ఎస్పీ వకుల్ చెప్పారు. ఈ పర్యటనలో విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్,ఎస్ఐ అశోక్ లు హాజరయ్యారు.
previous post