మూడు రాజధానులు తమకు వద్దని పొలిటికల్ JAC జిల్లా కన్వీనర్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. అమలాపురం లో నేడు జరిగిన JAC సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని 5 కోట్ల ప్రజల హక్కు అని ఆయన అన్నారు. అమరావతి ముద్దు త్రీ రాజధానులు వద్దు అంశం పై అమలాపురం షాదీఖానా లో అఖిల పక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.సత్తిబాబు అధ్యక్షత వహించారు. దీనిలో టీడీపీ నాయకులు మాజీ మంత్రి ఆనందరావు, కాంగ్రెస్ నాయకులు కల్వకొలను తాతాజీ , సుభాసాని టీడీపీ నాయకులు మెట్ల రఘుబాబు, జనసేన నాయకురాలు నాగ మానస తదితరులు పాల్గొన్నారు.